07-05-2021 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించినా...

lakshmidevi

మేషం : చేతి వృత్తి వ్యాపారాల్లో మార్పులు కనిపిస్తాయి. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్పట్ల అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. 
 
వృషభం : పండ్లు, కొబ్బరి, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. చిన్నచిన్న విషయాలలో ఉద్రేకంమాని తెలివితేటలతో ముందుకుసాగి జయం పొందండి. మీ శ్రీమతి వ్యాఖ్యలు మీపై బాగా ప్రభావం చూపుతాయి. ఉద్యోగ, రుణయత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మిథునం : ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మార్కెటింగ్, ప్రైవేటు సంస్థలలోనివారు అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతారు. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం వ్యయం చేస్తారు. మీ ప్రమేయం లేకున్నా కొన్ని తప్పిదాలకు బాధ్యత వహించవలసి ఉంటుంది. పెద్దల ఆరోగ్యం పట్ల మెళకువ అవసరం. 
 
కర్కాటకం : స్త్రీలతో మితంగా సంభాషించడం క్షేమదాయకం. ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రింటింగ్ రంగాలలో వారు అచ్చు తప్పులు పడుటవల్ల మాటపడవలసి వస్తుంది. మిత్రులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. 
 
సింహం : ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. ఏదైనా అమ్మకానికై చేయుయత్నాలు వాయిదావేయడం మంచిది కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
: ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకువేస్తారు. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యం. కొబ్బరి, పండ్లు, పూల చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. అనవసర వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. 
 
తుల : స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి మనస్పర్థలు తలెత్తుతాయి. ఊహించని ఖర్చులు ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు అంతగా వుండవు. ఉపాధ్యాయులకు పనిభారం తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. వృత్తులు, చిన్న తరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. విద్యార్థులకు ఆశించిన కోర్సులలో అవకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం : మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. దూర ప్రయాణాలలో మెళకువ అవసరం. ఉద్యోగం చేసే చోట అస్థిరత నెలకొనివుంటుంది. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయవలసి వస్తుంది. వాహనం నడుపునపుడు మెళకువ వహించండి. 
 
ధనస్సు : మీ హోదాకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఎన్ని అవరోధాలు తలెత్తినా వ్యాపార రంగంలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలు ఆదాయంపై ధన సంపాదనపై మరింత దృష్టిపెడతారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం కాగలవు. 
 
మకరం : ఉపాధ్యాయులు మార్పులకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులు, సభా సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన ధనం కొంత ముందు వెనుకలగానైనా అందటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. బంధువులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కుంభం : దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. మార్కెటింగ్ రంగాల వారికి ఏజెంట్లకు, బ్రోకర్లకు యాజమాన్యం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 
 
మీనం :  వైద్యులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. వారసత్వపు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీల మనోభావాలు వ్యక్తం చేయడం వల్ల అశాంతికి గురవుతారు. 


வெப்துனியா செய்திகள் உடனுக்குடன்!!! உங்கள் மொபைலில்... இங்கே க்ளிக் செய்யவும்
దీనిపై మరింత చదవండి :