శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

06-05-2021 గురువారం దినఫలాలు - సాయిబాబ గుడిలో అన్నదానం చేస్తే...

మేషం : మీ జీవిత భాగస్వామి వైఖరి మీక చికాకు కలిగిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సివుంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహాయం లభించక ఆందోళన చెందుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి. 
 
వృషభం : వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సత్ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా పూర్తిచేస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు ఏకాగ్రత చాలా అవసరం. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరాగలవు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మిథునం : వస్త్ర వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రావలసిన ధనం చేతికందుతుంది. ఓ చిన్న విహార యాత్ర చేస్తారు. కుటుంబీకుల ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
కర్కాటకం : నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
సింహం : బంధువుల రాకతో కుటుంబంలో ఉల్లాసం, సంతోషం కానవస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం మంచిదికాదు. వారికి కాస్త దూరంగా ఉండండి. దైవ, శుభకార్యాల్లో స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఆచితూచి మాట్లాడటం మంచిది. 
 
కన్య : ఆర్థికంగా అభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. స్త్రీలకు బంధు వర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఉమ్మడి వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాల ఆలోచన ప్రస్తుతానికి వాయిదావేయండి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు. 
 
తుల : రాజకీయ నాయకులు విందు, వినోదాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తికానవస్తుంది. తరచూ బంధు మిత్రుల రాకపోకలు ఉంటాయి. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. 
 
వృశ్చికం : పత్రికా రంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. వాహనచోదకులకు మెళకువ అవసరం. మీ కార్యక్రమాలు బంధువుల రాకతో మార్చుకోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. 
 
ధనస్సు : విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మకరం : స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ కుటుంబానికి మీరు ఎంతో అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. నూతన దంపతులకు సంతాన యోగం. మీరు చేసే పనికి ఫలితం మరోరకంగా ఉండే అవకాశం ఉంది. కార్యసాధనంలో ఆటంకాలు అధికమిస్తారు. 
 
కుంభం : ఉత్తర, ప్రత్యుత్తరాలు మీకు ఎంతో సంతృప్తినిస్తాయి. మనసులో భయాందోళనలు అనుమానాలు ఉన్నప్పటికీ డాంభికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తి చేస్తారు. దేవాలయ విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ప్రముఖులను కలుసుకుంటారు. 
 
మీనం : దంపతుల మధ్య పట్టింపులు, కలహాలు చోటుచేసుకుంటాయి. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఇతరుల మాటలు లెక్కచేయక అడుగు ముందుకేసి శ్రమించండి. అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు పెరిగినా సంతృప్తికరంగా ఉంటాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధిలా సహకరిస్తారు.