08-05-2021 శనివారం దినఫలాలు - నారాయణ స్వామి తులసీదళాలతో...

మేషం : ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు. మిత్రుల కలయికతో కొన్ని పనులు సానుకూలమవుతాయి. వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉపాధ్యాయులు నూతన అవకాశాలు లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇంటి విషయాలు పట్ల శ్రద్ధ వహిస్తారు. 
 
వృషభం : స్త్రీలకు రచనలు, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలలో బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. 
 
మిథునం : ప్రముఖుల కలయిక సాధ్యపడదు. మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఉద్యోగస్తులకు తోటివారి కారణంగా సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం విదేశాలు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. 
 
కర్కాటకం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. ధన వ్యయంలో ఏకాగ్రత వహించండి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగా వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. 
 
సింహం : వాతావరణ మార్పు వల్ల ఆందోళన గురవుతారు. వాహనచోదకులకు చికాకులు తలెత్తుతాయి. మత్స్యు, కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు అధికారుల నుండి ఒత్తిడి, కార్మికులతో సమస్యలు అధికమవుతాయి. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
: ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. దైవ, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. షాపింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. 
 
: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర రంగాల వారికి పురోభివృద్ధి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అధిక పర్యటనల వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంధువుల రాకతో మీ ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. సంకల్ప బలంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు కళ్లు, నరాలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. చెక్కుల జారీ, ఖాతాదారులు, పనివారలతో జాగ్రత్తగతా ఉండాలి. ఉద్యోగస్తులు చాకచక్యంగా వ్యవహరించి ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. 
 
ధనస్సు : సంగీత సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. బేకరీ, స్వీట్స్, తినుబండారాల వ్యాపారులకు తయారీదారులకు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలు ఉద్యోగ ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తిపరంగా చికాకులు సమస్యలు తలెత్తినా ధైర్యంగా నిలదొక్కుకుంటారు. 
 
మకరం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమదాయకం కాదు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. శారీకశ్రమ, మానసిక ఒత్తిడి వల్ల అస్వస్థతకు గురవుతారు. మిత్రులను కలుసుకుంటారు. 
 
కుంభం : వైద్యులకు ఆపరేషన్ల సమయంలో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులకు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. విలాస వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. స్త్రీలు, ఒత్తిళ్లు, మొహమ్మాటాలకు పోవడం వల్ల సమస్యలు తప్పవు. 
 
మీనం : ఆర్థిక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటారు. కార్మికుల కృషికి తగిన ప్రతిఫలం పొందుతారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాల వారికి అధికారిక వేధింపులు అధికం. ఇతరులకు ధనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. 


வெப்துனியா செய்திகள் உடனுக்குடன்!!! உங்கள் மொபைலில்... இங்கே க்ளிக் செய்யவும்
దీనిపై మరింత చదవండి :