మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 1 జూన్ 2024 (14:29 IST)

01-06-2024 నుంచి 30-06-2024 వరకు మీ మాస ఫలితాలు

weekly horoscope
మేష రాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం శుభయోగం. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు ప్రయోజనకరం. పెట్టుబడులు కలిసిరావు. సంతానం యత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. అపరిచితులను నమ్మవద్దు. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉన్నతాధికారులకు బాధ్యతల మార్పు, ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. వివాదాలు సద్దుమణుగుతాయి. 
 
వృషభ రాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మీ సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. సంతానం ఉన్నత చదువులపౌ దృష్టి సారిస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు స్వాగతం పలుకుతారు. 
 
మిథున రాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఓర్పుతో శ్రమిస్తే విజయం తథ్యం. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. అపోహలకు తావివ్వవద్దు. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పరిచయాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు స్థానచలనం, అధికారులకు హోదామార్పు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు పనులు లభిస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అప్రమత్తంగా మెలగాలి. ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. సాయం అర్ధించేందుకు మనస్కరించదు. బంధుమిత్రులతో విభేదిస్తారు. మీ మాటతీనే అదుపులో ఉంచుకోండి. సంతానం ఉన్నత చదువులపై శ్రద్ధ వహించండి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతలు విస్మరించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు స్థానచలనం. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పెట్టుబడులకు తరుణం కాదు. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలించవు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. అవివాహితులకు శుభయోగం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
గ్రహాలస్థితి అనుకూలంగా ఉంది. సమర్థతను చాటుకుంటారు. మీ కష్టం వృధాకాదు. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి వ్యయం చేస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది. గృహనిర్మాణాలు, మరమ్మతులు పూర్తి కావస్తాయి. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి ఉంటుంది. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఉపాధ్యాయులకు పదవీయోగం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సన్మాన, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ మాసం ద్వితీయార్ధం బాగుంటుంది. ఆచితూచి వ్యవహరించాలి. గుట్టుగా మెలగండి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు కలిసిరావు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. పనులు అనుకున్న విధంగా సాగవు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. నిరుద్యోగులకు ఓర్పు ప్రధానం. ఉపాధ్యాయులకు స్థానచలనం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట,
సంకల్ప సిద్ధికి ఓర్పు, పట్టుదల ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. అయిన వారితో విభేదిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉన్నతాధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కుంటారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. బుద్ధిబలంతో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు. అపోహలకు తావివ్వవద్దు. మనోధైర్యంతో మెలగండి. ఆప్తుల హితవు మీపై సత్ప్రభావం చూపుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రలోభాలకు లొంగవద్దు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే సాగించండి. సరుకు నిల్వలో జాగ్రత్త. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆదాయాభివృద్ధి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహారానుకూలతకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిరచరాస్తుల వ్యవహారంపై దృష్టి పెడతారు. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. ఉపాధ్యాయులకు శుభయోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. సమర్థతకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పదవులు అందుకుంటారు. బాధ్యతగా మెలగాలి. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవివాహితులకు శుభదాయకం. నూతన వ్యాపారాలు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలపైనే శ్రద్ధ వహించండి. ఉన్నతాధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉద్యోగస్తులకు కష్టసమయం. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవివాహితులకు శుభయోగం. సంతానం దూకుడు అదుపు చేయండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం తరుణం కాదు. చిరువ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.