సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (21:57 IST)

01-05- 2024 నుంచి 31-05-2024 వరకు మీ మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
మనోబలంతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణ ఒత్తిళ్లతో సతమతమవుతారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యపరీక్షలు అవసరమవుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణ ఒత్తిళ్లు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కుదరకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచిదే. ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉన్నతాధికారులకు హోదామార్పు, స్థానచలనం. దైవదర్శనాల్లో ఒకింత అవస్థలెదుర్కుంటారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ మాసం ప్రథమార్థం బాగుంటుంది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. ద్వితీయార్ధం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వృత్తుల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. మీ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఇతరుల కోసం వ్యయం చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. జాతక పొంతన ప్రధానం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఆచితూచి వ్యవహరించాలి. కార్యసాధనకు సంకల్పసిద్ధి ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సోదరీ సోదరులతో విభేదిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ధనసహాయం అర్ధించటానికి మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు, చికాకులు అధికం. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అభీష్టం నెరవేరుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు, కార్యక్రమాలు విజయవంతమవుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆత్మీయుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అయిన వారితో విభేదిస్తారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తప్పుపట్టవద్దు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. మీ బలహీనతలు అందుపులో ఉంచుకోండి. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
యోగదాయకమైన కాలం సమీపిస్తోంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. మీదైన రంగంలో రాణిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. గృహమార్పు అనివార్యం. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ చొరవతో ఒకరికి ప్రయోజనం కలుగుతుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. దైవదర్శనాలు కొత్త అనుభూతినిస్తాయి. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ఈ మాసం అనుకూలదాయకం. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సంతానం ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పత్రాలు సమయానికి అందుతాయి. కొత్త పనులు చేపడతారు. అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. కొనుగోలుదార్లను ఓ కంట కనిపెట్టండి. ఉద్యోగస్తులు అధికారులకు సన్నిహితులవుతారు. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పట్టుదలతో శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆత్మీయుల సలహా పాటించండి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. గత సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. యాదృచ్ఛికంగా తప్పిదాలు దొర్లే ఆస్కారం ఉంది. ప్రముఖులకు ఆత్మీయ స్వాగతం పలుకుతారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శుభసమయం నడుస్తోంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహనిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. వస్త్రలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వ్యవహారాల్లో పెద్దల సలహా పాటించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు మానసికంగా స్థిమితపడతారు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆధ్మాత్మిక చింతన పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో జయం, ధనలాభం ఉన్నాయి. మనోభీష్టం నెరవేరుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. రుణసమస్యలు తొలగుతాయి. తాకట్టు విడిపించుకుంటారు. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితం సాధిస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అభ్యంతరాలు పట్టించుకోవద్దు. వ్యవహార ఒప్పందాల్లో పెద్దలు సహకరిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. సంతానానికి శుభయోగం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు హోదామార్పు. ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆప్తులకు సాయం అందిస్తారు. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అపరిచితులతో మితంగా సంభాషించండి. వాగ్వాదాలకు దిగవద్దు. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉపాధి పథకాలు పురోగతిన సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను తట్టుకుంటారు. చిన్న వ్యాపారులకు ఆశాజనకం.