గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (13:14 IST)

ఐపీఎల్ 2024 : బంపర్ విక్టరీ సాదించిన కోల్‌కతా నైట్ రైడర్స్!

kkriders
ఐపీఎల్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా, సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు ఏడు వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16.3 ఓవర్లలోనే ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీ (68) తో రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 33, వెంకటేశ్ అయ్యర్ 26 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2, విలియమ్స్ ఒక వికెట్ తీశారు.
 
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన డీసీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 35 పరుగులతో ఆ జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 27 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ 18, అక్షర్ పటేల్ 15, పృథ్వీ షా 13, ఫ్రేజర్-మెక్ గుర్క్ 12 పరుగులు చేశారు. ఇక చివరలో కుల్దీప్ ఆదుకోకుంటే ఢిల్లీ ఈ స్కోర్ కూడా చేసే ఉండేది కాదు.
 
కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే వైభవ్ అరోరా, హర్షిత్ రాణా చెరో రెండు వికెట్లు.. సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్ తలో వికెట్ తీశారు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి, కీలకమైన 3 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది ఆరో విజయం కాగా, ఢిల్లీకి ఆరో పరాజయం. ప్రస్తుతం 12 పాయింట్లతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు డీసీ 9 మ్యాచులాడి 6 మ్యాచుల్లో గెలవడం విశేషం. ఢిల్లీ ఇప్పటివరకు 11 మ్యాచుల్లో 5 విజయాలతో ఆరో స్థానంలో ఉంది.