మంగళవారం, 21 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2024 (09:14 IST)

చెన్నైపై అదుర్స్ గెలుపు.. లక్నో ఆల్‌టైమ్ రికార్డు.. రాహుల్ ఖాతాలో?

LSG vs CSK highlights
LSG vs CSK highlights
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌‌లో ఆల్‌టైమ్ రికార్డును సృష్టించింది. శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది.  సొంత మైదానం ఏకనా క్రికెట్ స్టేడియంలో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా లక్నో నిలిచింది. గతంలో ఇక్కడ అత్యధిక ఛేదన 168 పరుగులుగా ఉంది. ఈ ఏడాది సీజన్‌లోనే లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రికార్డు స్థాయి ఛేదన చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. 
 
లక్నో సూపర్ జెయింట్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ చేతిలో ఓటమిపాలైన లక్నో శుక్రవారం సత్తాచాటింది. సొంతమైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎనిమిది వికెట్లతో చిత్తుచేసింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతూ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో 50+ స్కోరు‌ను అత్యధిక సార్లు చేసిన వికెట్‌కీపర్‌గా రాహుల్ చరిత్రకెక్కాడు.
 
ఐపీఎల్‌లో 50+ స్కోరును రాహుల్ 25 సార్లు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ 24 హాఫ్‌సెంచరీలు బాదాడు. రాహుల్, ధోనీ తర్వాతి స్థానాల్లో డికాక్ (23), దినేశ్ కార్తీక్ (21), రాబిన్ ఊతప్ప (18) ఉన్నారు.