మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 31 మార్చి 2024 (22:32 IST)

01-04-2014 నుంచి 30-042024 వరకు మీ మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
అనుకూలతలు అంతగా ఉండవు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆదాయం నిరాశాజనకం. ఊహించని ఖర్చులు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. దంపతుల మధ్య తరచు కలహాలు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ప్రధానం. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెట్టండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ మాసం ప్రథమార్ధం యోగదాయకం. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. సముచిత ఆలోచనలతో ముందుకు సాగుతారు. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూమవుతుంది. వాస్తుదోష నివాణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు పరీక్షలు సంతృప్తికరంగా రాయగల్గుతారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. మీ మాట సర్వత్రా చెల్లుబాటవుతుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఇతరుల కోసం విపరీతంగా ఖర్చుచేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి మంచి జరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరచరాస్తుల కొనుగోలుపై దృష్టి పెడతారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి పనులు లభిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గ్రహాల సంచారం నిదానంగా అనుకూలిస్తుంది. పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ఆధిపత్యం కొనసాగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ప్రయోజనం కలిగిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కొత్త పనులు చేపడతారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. పొగడ్తలకు పొంగిపోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన ఫలితాలుంటాయి. నూతన వ్యాపారాలకు అనువైన సమయం. ఉపాధి పథకాలు చేపడతారు. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. కొంతమంది మీ ఆలోచనలు నీరుగార్చేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి విషయంలో పట్టుదలకు పోవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించండి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ నిర్ణయాన్ని ఉభయులూ పాటిస్తారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పనిభారం. అధికారులకు కొత్త సమస్యలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు, వస్తువులు లభ్యమవుతాయి. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసం మీ ఓర్పునేర్పులకు పరీక్షాసమయం. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు తప్పవు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజాన్నిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. కార్యసాధనకు, అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. సంప్రదింపులు ఫలించవు. దృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. దంపతుల మధ్య తరచూకలహాలు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులుంటాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. వాహనదారులకు దూకుడు తగదు.
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. మీ సామర్ధ్యంపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ సంకల్పబలమే కార్యసిద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. స్థిరచరాస్తుల విషయంలో పునరాలోచన మంచిది. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలదాయకమే. కార్యసిద్ధి, ప్రశాంతత ఉన్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. పరిచయస్తులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. అభివృద్ధిపథంలో ముందుకు సాగుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. అధికారులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. చిరువ్యాపారులకు ఆశాజనకం.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అభివృద్ధి దిశగా అడుగులేస్తారు. కార్యం సిద్ధిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా మెలగాలి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ శ్రీమతిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను నమ్మవద్దు. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విదేశీ పర్యటనలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రేమానుబంధాలు బలపడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. లక్ష్యాలను సాధిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఏకాగ్రతతో మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అవివాహితులు శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నూతన వ్యాపారాలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు పురస్కారయోగం. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. పందాలు, జూదాలకు పాల్పడవద్దు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం శుభాశుభాల మిశ్రమ సమ్మేళనం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆప్తుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిప్యం ప్రదర్శించవద్దు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉపాధ్యాయులకు పనిభారం. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్నవ్యాపారులకు పురోభివృద్ధి. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది.