శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (20:07 IST)

01-02-2024 నుంచి 29-02-2024 వరకు ఫిబ్రవరి మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం ప్రథమార్ధం అనుకూలదాయకమే. ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు అధికం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. పదవీ బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ద్వితీయార్ధంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. భూ సంబంధిత వివాదాలు నిరుత్సాహపరుస్తాయి. 
25, 6, 12, 14, 16, 19, 20, 22, 24, 27, 29 తేదీలలో పురోభివృద్ధి.
4, 7, 9, 10, 11, 13, 15, 17, 23, 25, 26 తేదీలలో అప్రమత్తంగా ఉండాలి.
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సంకల్పం నెరవేరుతుంది. తలపెట్టిన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యవహార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. సంతానం చదువులపై దృష్టి సారించండి. తరచు శుభకార్యాల్లో పాల్గొంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాల కంటే సొంత వ్యాపారాలే కలిసివస్తాయి. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వాహనదారులకు దూకుడు తగదు. 
26, 12, 16, 19, 22, 27, 29 తేదీలు కలిసివస్తాయి.
1, 3, 9, 11, 13, 15, 17, 25, 28 తేదీలలో అసంతృప్తి.
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం పొందుతారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. గృహంలో మార్పుచేర్పులు అనివార్యం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మీ సాయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పదవులు, సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
5, 6, 14, 19, 20, 24, 27 తేదీలలో పురోభివృద్ధి.
1, 4, 7, 10, 11, 15, 23, 26, 28 తేదీలు నిరాశాజనకం.
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. ఆచితూచి అడుగేయాలి. శ్రమించినా ఫలితం ఉండదు. మీపై శకునాల ప్రభావం అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఈ చికాకులు తాత్కాలికమే. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యం. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు పట్టుదల ప్రధానం. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుంది. తరచూ ఆలయాలు సందర్శిస్తారు.
26, 12, 16, 19, 20, 22, 27, 29 తేదీలు కలిసిరాగలవు.
1, 3, 9, 10, 11, 13, 15, 23, 25, 28 తేదీలు నిరాశాజనకం.
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిరుత్సాహానికి గురవుతారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య తరచూ కలహాలు. సామరస్యంగా మెలగండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. అవివాహితులకు శుభయోగం. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. ఆహ్వానం అందుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. 
2. 12, 14, 19, 20, 24, 27, 29 తేదీలలో అభివృద్ధి
3, 4, 7, 10, 11, 15, 17, 23, 26, 28 తేదీలలో అప్రమత్తంగా ఉండాలి.
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఈ మాసంలోను గ్రహాల స్థితి అనుకూలంగానే ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అందరితోను కలుపుగోలుగా మెలుగుతారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. దుబారా ఖర్చులు అధికం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పొదుపు చేయాలన్న లక్ష్యం నెరవేరదు. ఆహ్వానాలు, పత్రాలు అందుకుంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. మీ ప్రమేయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
56, 14, 16, 20, 22, 24, 27, 29 తేదీలు ఆశాజనకం.
1, 4, 7, 9, 11, 13, 17, 23, 25, 26 తేదీలు అసంతృప్తికరం.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. కానుకలిచ్చిన పుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అపరిచితులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. అయిన వారి ఆరోగ్యం కుదుటపడుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 
2, 6, 12, 16, 19, 20, 22, 27, 29 తేదీలలో అభివృద్ధి.
3, 7, 10, 13, 15, 17, 25, 26, 28 తేదీలలో జాగ్రత్త.
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. మీ నిజాయితీ ప్రశంసనీయమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో మెళకువ వహించండి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పనులు వేగవంతమవుతాయి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. నూతన పెట్టుబడులు కలిసివస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
25, 6, 12, 14, 16, 19, 20, 22, 24, 27, 29 తేదీలు ఆశాజనకం.
4, 7, 9, 10, 11, 13, 15, 17, 23, 25, 26 తేదీలలో అప్రమత్తంగా ఉండాలి.
 
ధనరాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం బాగుంటుంది. కార్యసిద్ధి, వ్యవహారజయం పొందుతారు. రావలసిన ధనం అందుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పత్రాలు అందుకుంటారు. గృహనిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. సరుకు నిల్వలో జాగ్రత్త. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. ప్రయాణం తలపెడతారు. 
5, 6, 14, 19, 20, 24, 27, 29 తేదీలు అనుకూలం.
1, 3, 9, 11, 13, 17, 23, 25, 28 తేదీలు ప్రతికూలతలు అధికం.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గ్రహాల సంచారం కొంతమేరకు అనుకూలంగా ఉంది. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఖర్చులు భారమనిపించవు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. సంస్థల స్థాపనలకు మరికొంత కాలం వేచి ఉండాలి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. తరచూ వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను నమ్మవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. 
25, 12, 16, 19, 22, 27, 29 తేదీలు కలిసిరాగలవు..
3, 4, 7, 11, 13, 15, 17, 23,26, 28 తేదీలు నిరాశాజనకం. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొన్నింటిలో అనుకూలత, మరి కొన్నింటిలో ప్రతికూలతలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించటానికి సందేహించవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. అన్యమస్కంగా కాలం గడుపుతారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు నిదానంగా ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
26, 14, 16, 22, 24, 27 తేదీలలో అభివృద్ధి.
1, 7, 9, 11, 15, 17, 23, 26, 28 తేదీలలో శ్రమ అధికం.
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. విజ్ఞతతో వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. చేతిలో ధనం నిలవదు. పెద్దఖర్చు తగిలే ఆస్కాం ఉంది. ఆదాయమార్గాలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
2 5, 12, 14, 19, 20, 22, 27, 29 తేదీలు కలిసిరాగలవు.
1, 3, 9, 10, 11, 13, 17, 23, 25, 26, 28 తేదీల్లో నిరుత్సాహం తప్పదు.