బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 1 జనవరి 2024 (16:34 IST)

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జర్నీ రీ రిలీజ్

Journey rerelease poster
Journey rerelease poster
దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘జర్నీ’ సినిమా అప్పట్లో యూత్‌ను ఎంతగా కట్టి పడేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంజలి జై, శర్వానంద్ అనన్య జోడి, వారి ప్రేమ కథలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం.శరవణన్ దర్శకత్వం, సీ.సత్య సంగీతం అప్పటి ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేశాయి. థియేటర్లో ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించారు. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది.
 
అసలే టాలీవుడ్‌లో ఇప్పుడు రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్‌లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ.సుప్రియ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్‌గా మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు.