బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రైలులో ఎదురుపడిన బాలుడికి లాప్‌టాప్‌ను బహుమతిగా ఇచ్చిన రైల్వే మంత్రి

rajiv chandrasekhar
తనకు రైలులో తారసపడిన ఓ బాలుడికి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బహుమతిగా లాప్‌టాప్ ఇచ్చాడు. దీంతో ఆ బాలుడి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. తాను రూపొందించిన వీడియోలను బాలుడు మంత్రికి చూపించాడు. వీటిని చూసిన మంత్రి ఆ బాలుడిలోని సృజనాత్మకతను చూసి మురిసిపోతూ లాప్‌టాప్ బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చి, తన మాటను నిలబెట్టుకున్నారు. 
 
ఇటీవల రైల్వే మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ త్రిస్సూర్ నుంచి కోళికోడ్ వెళుతుండగా రైల్లో తొమ్మిదేళ్ల బాలుడు శ్రీరామ్ తారసపడ్డారు. తాను రూపొందించిన పలు సృజనాత్మక వీడియోలను మంత్రికి చూపించి ఎంతో సంతోషపడిపోయాడు. వీటిని చూసిన తాను కూడా ఆనందం వ్యక్తంచేశాను. పైగా, అతడికి కొత్త లాప్‌టాప్‌ను బహుమతిగా ఇస్తానని మంత్రి మాట ఇచ్చారు. ఈ మాటను ఇపుడు నిలబెట్టుకున్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే, కొత్త సంవత్సర బహుమతిగా లాప్‌టాప్ ఇచ్చానని మంత్రి తెలిపారు. బాలుడికి అతడి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రాజీవ్ చంద్రశేఖర్... ఆ బాలుడు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్.... ఎప్పటి నుంచి అంటే... 
 
ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలని భావించే వారి కోసం ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్ళు ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 26వ తేదీల మధ్య నడుపుతామని పేర్కొంది. ఈ రైళ్లను కాచిగూడ - కాకినాడ టౌన్, హైదరాబాద్ - తిరుపతి మార్గాల్లో నడుపనున్నట్టు తెలిపింది. వీటిలో స్లీపర్, జనరల్ బోగీలతో పాటు ఫస్ట్ ఏసీ, సెంకడ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీలు కూడా ఉంటాయని పేర్కొంది. 
 
తిరుపతి - హైదరాబాద్ (07510) ప్రాంతాల మధ్య డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో ప్రత్యేక రైలును నడుపుతారు. శుక్రవారం రాత్రి 8.15 గంటల ప్రయాణం మొదలై శనివారం ఉదయం 8.40 గంటలకు ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతుంది. 
 
హైదరాబాద్ - తిరుపతి రైలు (07509) సర్వీసు ఇక డిసెంబర్ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది. గురువారం రాత్రి 7.25 గంటలకు బయల్దేరి శుక్రవారం ఉదయం 8.20 గంటలకల్లా గమ్యస్థానం చేరుతుంది. 
 
అదేవిధంగా హైదరాబాద్ - తిరుపతి - హైదరాబాద్ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయని ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.
 
అలాగే, కాచిగూడ - కాకినాడ టౌన్ రైలు (07653) డిసెంబర్ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో (గురువారాలు) రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుతుంది. ఇక కాకినాడ టౌన్ - కాచిగూడ రైలు (07654) డిసెంబర్ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు జామున 4.50 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. 
 
ఈ రైలు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.