శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2023 (09:14 IST)

కుమార్తెకు రూ.50కోట్ల విలువైన బంగ్లాను బహుమతిగా ఇచ్చిన బిగ్ బి

Amitab Bachan
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన కుమార్తె శ్వేతా బచ్చన్‌కు సుమారు రూ. 50.63 కోట్ల విలువైన తన విలువైన బంగ్లా 'ప్రతీక్ష'ను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. 
 
రెండు వేర్వేరు గిఫ్ట్ డీడ్‌ల ద్వారా నవంబర్ 8న పూర్తి చేసిన యాజమాన్య బదిలీలో రూ.50.65 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు జరిగింది. 
 
జుహులో ఉన్న ప్రతీక్ష, అమితాబ్ మొదటి ఇల్లు. ఇది సెంటిమెంట్ విలువను కలిగి ఉంది. ఎందుకంటే అతను తన కెరీర్ ప్రారంభ సంవత్సరాల్లో తన తల్లిదండ్రులతో అక్కడ నివసించారు.
 
'ప్రతీక్ష' అనే పేరు అతని తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ ద్వారా పెట్టడం జరిగింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ల గ్రాండ్ వెడ్డింగ్‌తో సహా కుటుంబ కార్యక్రమాలలో ఈ బంగ్లా కీలక పాత్ర పోషించింది.