బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2024 (20:32 IST)

01-03-2024 నుంచి 31-03-2024 వరకు మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఆర్థికలావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. కష్టించినా ఫలితం అంతంత మాత్రమే. ఖర్చులు అదుపులో ఉండవు. ధనసమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య తరుచు కలహాలు. మనస్థిమితం ఉండదు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. నిరుద్యోగులకు ఏకాగ్రత, పట్టుదల ప్రధానం. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులకు పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. సరుకు నిల్వలో జాగ్రత్త. ప్రయాణం విరమించుకుంటారు. అసాంఘిక కార్యక్రమాల జోలికి పోవద్దు.
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతగా మెలగాలి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య తరచు అకారణ కలహం. పంతాలకు పోవద్దు. ఆత్మీయుల రాకపోకలు అధికమవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అన్ని రంగాల వారికీ శుభదాయకమే. కార్యసాధనలో జయం, ధనలాభం పొందుతారు. సంప్రదింపులు ఫలిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. నూతనోత్సాహంతో యత్నాలు సాగిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. గృహాలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. విందులు, వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. రాబడిపై దృష్టి సారిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సంకల్ప బలం ముఖ్యమని తెలుసుకోండి. సమష్టి కృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ అవసరం. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం అనుకూలతలు అంతంత మాత్రమే. కార్యసాధనకు మనోబలం ముఖ్యం. ఆశావహదృక్పధంతో వ్యవహరించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. సంతానం చదువులపై దృష్టి సారించండి. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వేడుకకు హాజరవుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. కార్యసాధనలో సఫలీకృతులవుతారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయటా అనుకూలతలు నెలకొంటాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు లోటుండదు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంది. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పత్రాల్లో సవరణలు అనివార్యం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనివార్యం.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
ఈ మాసం అనుకూలదాయకం. లక్ష్మాన్ని సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది, ఖర్చులు భారమనిపించవు. కొంత మొత్తం పొదుపు చేయగల్గుతారు. సంస్థల స్థాపనలకు తగిన సమయం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. నిరుద్యోగులకు కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. విద్యార్థులకు సమయపాలన ప్రధానం. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పత్రాల్లో సవరణలు అనివార్యం. ఆహ్వానం అందుకుంటారు. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. వాయిదా పడిన పూర్తి చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతానం చదువులపై దృష్టి సారించండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులతో సంభాషిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ప్రేమ వ్యవహారాలు సమస్యాత్మకమవుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధి, వ్యవహార జయం ఉన్నాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనులు వేగవంతమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపుల స్థల మార్పు కలిసివస్తుంది. సరుకు నిల్వలో జాగ్రత్త. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికస్థితి సామాన్యం. ఖర్చులు అదుపులో ఉండవు. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. మనోబలంతో యత్నాలు సాగించండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. గృహమార్పు అనివార్యం. అపరిచితులతో జాగ్రత్త. కొంతమంది మీ నుంచి విషయసేకరణకు యత్నిస్తారు. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీకులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల్లో సవరణలను అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వైద్యపరీక్షలు చేయించుకోవటం శ్రేయస్కరం. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. మిత సంభాషణ శ్రేయస్కరం. దంపతుల మధ్య సఖ్యత లోపం. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆత్మీయుల వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు.