1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 20 జనవరి 2024 (16:32 IST)

21.01.2024 నుంచి 27.01.2024 వరకు మీ వార రాశిఫలితాలు

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. మంగళవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. సమర్ధతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. పత్రాలు అందుకుంటారు. ఇంటి విషయాలపై అశ్రద్ధ తగదు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థలో మదుపు తగదు. గురు, శుక్ర వారాల్లో ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు ఒత్తిడి, చికాకులు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. కంప్యూటర్ రంగాల వారికి నిరాశాజనకం. రిప్రజెంటేటివ్లకు మార్పులు అనుకూలిస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. మొహమ్మాటాలకు పోవద్దు. అందరితోను మితంగా సంభాషించండి. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెట్టుబడులకు తరుణం కాదు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఆప్తుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారజయం, ప్రశాంతత పొందుతారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పనుల్లో ఒత్తిడి అధికం. శనివారం నాడు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. పట్టుదలతో యత్నాలు కొనసాగిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు. వృత్తి వ్యాపారాల్లో పురోగమిస్తారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఆరోగ్యం బాగుంటుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యంకావు.
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు ఫలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. సంతానం చదువులపై దృష్టి పెట్టండి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శుభకార్యానికి శ్రీకారం చుడతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. గృహంలో మార్పుచేర్పులు కలిసివస్తాయి. ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. బుధవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం యత్నాలు ఫలిస్తాయి. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి నిరాశాజనకం. ఆరోగ్యం మందగిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు కొంత మొత్తం పొదుపు చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహిఈంచండి. ఆది. గురు వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పనులు వాయిదా వేసుకుంటారు. దంపతుల మధ్య అరమరికలు తగవు. గృహమార్పు కలిసివస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సమర్థతను చాటుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. శుక్రవారం నాడు ఫోన్ సందేశాలను నమ్మవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార పరిజ్ఞాంతో నెట్టుకొస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. స్థిరాస్తి అమర్చుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. శనివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు, కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పత్రాల్లో సవరణలు అనివార్యం. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. నూతన వ్యాపారాలపై దృష్టి సాగిస్తారు. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. కొంతమంది వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సన్నిహితులకు మీ సమస్యలను తెలియజేయండి. ఆప్తుల సాయంతో అవసరాలు నెరవేరుతాయి. మానసికంగా కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. మీ శ్రీమతి విషయంలో శుభం జరుగుతుంది. బంధవులతో సంతానం యత్నాలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఉపాధ్యాయుల కష్టం ఫలిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. సమష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. సంకల్ప బలం ముఖ్యమని గ్రహించండి. మంగళవారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. భేషజాలకు పోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని రంగాల వారికీ యోగదాయకమే. సంతోషకరమైన వార్తలు వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. బాధ్యతలు అప్పగించవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.