1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Today 02-04-2026 Daily Astrology

02-05-2026 శనివారం ఫలితాలు - ఆప్తులతో కాలక్షేపం చేస్తారు.. శుభకార్యానికి హాజరవుతారు...

Daily Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ సహనానికి పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సలహాలు, సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు సామాన్యం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. శ్రమతో కూడిన విజయాలున్నాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు, పనులు సాగవు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. దంపతుల మధ్య అకారణ కలహం. చేసిన పనులు మొదటికే వస్తాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ముఖ్యం. విమర్శలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
విశేషమైన కార్యసిద్ధి ఉంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మాట నిలబెట్టుకుంటారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. పనులు హడావుడిగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు సామాన్యం. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రయాణం తలపెడతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. వ్యవహారాల్లో తప్పటడుగువేస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కార్యసిద్ధికి సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు తగ్గించుకుంటారు. చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు చురుకుగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రతి విషయంలోను దూకుడుగా వ్యవహరిస్తారు. మీ మాటతీరు వివాదాస్పదమవుతుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం. పనులు వేగవంతమవుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
సూర్యోదయం వేళ జపించాల్సిన మంత్రం ఏమిటి?