గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (10:38 IST)

18-02-2024 ఆదివారం దినఫలాలు - సూర్య నారాయణ పారాయణ చేసినా...

horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ శు॥ నవమి ప.12.24 రోహిణి ప.1.25 ఉ.శే.వ. 7.05 కు
రా.వ.7.04 ల 8.41. సా.దు. 4.22ల 5.07.
సూర్య నారాయణ పారాయణ చేసినా అన్నివిధాలా కలిసివస్తుంది.
 
మేషం :- వ్యాపారులు కొనుగోలుదార్లతో చికాకులు, సమస్యలు ఎదుర్కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. 
 
వృషభం :- ఏదైనా అమ్మకానికై చేయుప్రయత్నాలు వాయిదా పడగలవు. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొంటారు. రాజకీయ నాయకులు వాగ్ధానాలు చేసి సమస్యలు తెచ్చుకోకండి. హోటల్ తినుబండ, క్యాటరింగ్ రంగాలలో వారికి లాభదాయకంగా ఉంటుంది. విరామ కాలక్షేపాల ద్వారా ఊరట పొందుతారు.
 
మిథునం :- కొబ్బరి, పండు, పూల వ్యాపారులకు లాభదాయకం. రవాణా రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. సన్నిహితులను కలుసుకుంటారు. కుటుంబంలో మానసిక విజ్ఞతాయుతంగా ఒక సమస్యను పరిష్కరిస్తారు. అంతగా పరిచయంలేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం.
 
కర్కాటకం :- ఆర్థికంగా ఎదగడానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధు మిత్రులను నుంచి అపనిందలు, అవమానాలు వంటివి ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది.
 
సింహం :- ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెళకువ వహించండి. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. రాజకీయ రంగాల్లో వారు ప్రత్యర్థుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు.
 
కన్య :- ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు శుభదాయకం. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఋణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. రవాణా వ్యవహరాలలో ఆచితూచి వ్యవహరించండి.
 
తుల :- నిరుద్యోగులు గడచిన కాలం గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయకుండా వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొండి. మిత్రుల రాక వల్ల ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చు తప్పులు పడుటవలన మాటపడవలసి వస్తుంది. కొత్త పనులు చేపడతారు.
 
వృశ్చికం :- వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. విదేశాల్లోని ఆత్మీయులకు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై ప్రయత్నిస్తారు. శ్రమ కోర్చి పనులు పూర్తి చేస్తారు.
 
ధనస్సు :- రాజకీయ నాయకుల పర్యటనల్లో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. పాత మిత్రుల కలయికతో మీలో నూతన ఉత్సాహం కానరాగలదు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, వ్యాపకాలు అధికవుతాయి. బంధు, మిత్రుల నుండి మొహమాటాలు ఎదుర్కొంటారు. ఊహించని ఒక లేఖ మిమ్మల్ని ఎంతో ఆశ్చర్య పరుస్తుంది.
 
మకరం :- దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గుంటారు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. స్త్రీలకు వాహనయోగం వంటి శుభ ఫలితాలుఉన్నాయి. స్థిరాస్తి విషయంలో కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు జరుగుతాయి.
 
కుంభం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కొన్ని సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతి దూరం చేస్తారు.
 
మీనం :- పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. సామరస్యంతో మీ సమస్యలు పరిష్కరించుకోవాలి. బంధు మిత్రులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు ప్రశంసలందుకుంటారు. నిరుద్యోగులకు, వృత్తుల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి.