శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-11-2024 మంగళవారం ఫలితాలు - పిల్లల దూకుడు కట్టుడి చేయండి....

astro8
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
వ్యవహారపరిజ్ఞానంతో నెట్టుకొస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఖర్చులు అధికం, కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు స్థిమితంగా పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. పత్రాలు అందుకుంటారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు కొనసాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు, పురమాయించవద్దు. ఆత్మీయులరాక ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అనవసర జోక్యం తగదు. దైవకార్యంలో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు వాయిదా వేసుకుంటారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. ప్రయాణం తలపెడతారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పనులు, కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. విజ్ఞతతో అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. సాయం అర్థించేందుకు మనస్కరించదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల దూకుడు కట్టుడి చేయండి. ఆలయాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. రావలసిన ధనం అందుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి ధోరణి అసహనం కలిగిస్తుంది. అందరితోను మితంగా సంభాషించండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. చేసిన పనులే చేయవవలసి వస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అనుకున్నది సాధిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది.