బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-06-202 మంగళవారం దినఫలాలు - ఊహించని రీతిలో ధనలాభం పొందుతారు....

Astrology
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట ఐ|| చవితి రా.1.17 శ్రవణం సా.4.53 రా.వ.8.43 ల 10.14. ఉ.దు.8.03 ల 8.55, రా.దు. 10.51 ల 11.35.
 
మేషం :- బంధు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. బ్యాంక్ వ్యవహారాలలో మెళుకువ చాలా అవసరం. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. 
 
వృషభం :- ఆర్థికస్థితిలో ఏమాత్రం పురోభివృద్ధి ఉండదు. దంపతుల మధ్య నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. కొబ్బరి, పండ్లు, పూలు చిరువ్యాపారులకు సామాన్యం. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆందోళన పెరుగుతుంది.
 
మిథునం :- ఆదాయానికి మంచి ఖర్చులు అధికమవుతాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.
 
కర్కాటకం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. చిన్నతరహా పరిశ్రమల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల వ్యవహారాలు అనుకూలిస్తాయి. 
 
సింహం :- వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. పనులు వాయిదాపడతాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు.
 
కన్య :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకం. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి.
 
తుల :- ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల సమాచారం అందుకుంటారు. దైవ సేవా కార్యమ్రాల కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి అధికమవుతుంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు సామాన్యం. ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం :- ఆదాయ వ్యయాల్లో సమతుల్యత ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో బాగుగా రాణిస్తారు. మొండి బాకీలు తీరుస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుటవలన మాట పడవలసివస్తుంది. పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారం అవుతాయి. గృహంలో ఒక శుభకార్యానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి.
 
ధనస్సు :- ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.ఆలయాలను సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాలలోని పనులు చురుకుగా సాగుతాయి.
 
మకరం :- బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేతి వృత్తుల వారికి ఆశాజనకం. బంధువుల రాకతో ధనం అధికంగా వెచ్చిస్తారు. వ్యాపారస్తులకు అధికారుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం.
 
కుంభం :- ఆర్థికంగా బాగుగా అభివృద్ధి చెందుతారు. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. బ్యాంకు వ్యవహారాలు వాయిదాపడతాయి.
 
మీనం :- ఎల్.ఐ.సి, పోస్టల్, ఇళ్ళ స్థలాల బ్రోకర్లకు, ఏజెంట్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మీ సంకల్ప బలానికి సన్నిహితుల సహాయం తోడవుతుంది. మీ కళత్రమొండి వైఖరి, కుటుంబీకుల పట్టుదల మనశ్శాంతిని దూరం చేస్తాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.