సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-07-2023 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించిన...

astro3
మేషం :- స్త్రీలు ఆడంబరాలకుపోయి సమస్యలు తెచ్చుకోకండి. మార్కెటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యత తప్పవు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. కాంట్రాక్టర్లకు అనుకోని సదావకాశాలు లభిస్తాయి.
 
వృషభం :- విద్యార్థులకు గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. రావలసిన ధనం చేతికందడంతో రుణంతీర్చాలనే మీ యత్నం నెరవేరుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ కుటుంబీకులకు ప్రతి విషయం తెలియజేయటం మంచిది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. ఒకస్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
మిథునం :- వృత్తుల వారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఆధ్యాత్మిక విషయాలు, దాన ధర్మాలకు ఖర్చులు చేస్తారు. గతకాలం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
కర్కాటకం :- రియల్ఎస్టేట్ వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు తప్పవు. విదేశీయానం, రుణయత్నాల్లో చికాకులు తప్పవు. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత అవసరం. మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ప్రయాణాలు సంతృప్తిని ఇస్తాయి.
 
సింహం :- హోటల్, తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకం. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండుట మంచిది. శారీరకశ్రమ, మానసికాందోళనల వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి.
 
కన్య :- ఆర్థిక లావాదేవీలు ఊహించిన విధంగానే ఉంటాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదావకాశాలు లభిస్తాయి. పత్రిక, ప్రైవేటు సంస్థల్లోని వారికి ఓర్పు, సహనం అవసరం. రాజకీయ నాయకులు సభలు సమావేశాలలో పాల్గొంటారు. నిత్యావసర సరుకుల స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది.
 
తుల :- ఉద్యోగస్తులకు పైఅధికారులను నుంచి ఒత్తిడి అధికమవుతుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు. కుటుంబంలో ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. కళ, క్రీడ, శాస్త్రరంగాల వారికి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఖర్చులు మీ అంచనాలు మించటంతో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు.
 
ధనస్సు :- విదేశీయానం నిమిత్తం చేస్తున్న యత్నాలలో ఆటంకాలు తొలగిపోతాయి. స్త్రీలకు సంపాదనపై ఆసక్తి పెరుగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. సహోద్యోగులతో వాగ్వివాదాలకు దిగకండి. పాత సమస్యలు పరిష్కరిస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు.
 
మకరం :- ఆర్థికస్థితిలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ఒక సమావేశానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. మీకు రాబోయే ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు సిద్ధిమవుతుంది. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
కుంభం :- ఉపాధ్యాయులకు విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులు తప్పవు. అసలైన సంతృప్తితో మరిన్ని కొత్త అవకాశాల్ని సొంతం చేసుకుంటారు. ఊహించని లాభాల్ని సొంతం చేసుకుంటారు. నిర్మొహమాటంగా మాట్లాడటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. స్త్రీలు వస్త్రాలు, ఆభరణాలు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.
 
మీనం :- బ్యాంకింగ్ వ్యవహారాలలోని పనులు మందకొడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కనవస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీకూ, మీరు ప్రేమించే వ్యక్తికి మధ్య సరైన అవగాహన కుదిరి ఒక్కటవుతారు. పెద్ద పెద్ద రుణాలకు దూరంగా ఉండటం మంచిది.