శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-07-2023 ఆదివారం రాశిఫలాలు - ఆదిత్యుని ఆరాధించిన సర్వదా శుభం...

Puja
మేషం :- మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించటం మంచిది కాదు. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. దూరపు బంధువుల ప్రోత్సాహంతో పనులలో పురోభివృద్ధిని సాధిస్తారు. రాజకీయనాయకులు వివాదస్పదమైన వ్యాక్యానాలు చేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
వృషభం :- స్థిరాస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. సోదరి, సోదరుల వ్యవహారాల్లో ఊహించని మార్పులు కానరాగలవు. మీరు ఉద్దేశ్య పూర్వకంగా ఎవరినీ దూషించకపోయినా ఎదుటివారి అపోహలకు లోనైయ్యే అవకాశం ఉంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.
 
మిథునం :- మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. కంప్యూటర్, ఎలక్ట్రికల్ రంగాలలో వారికి పనివారితో సమస్యలు తలెత్తగలవు. మీ గౌరవానికి భంగం కలిగించే సంఘటన లెదురవుతాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం :- విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబీకుల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. మీ చిన్నారుల గురించి మంచి మంచి పథకాలు, ప్రణాళికలు వేస్తారు. మీ వ్యవహార జ్ఞానం, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీల తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు.
 
సింహం :- ఆహార, వ్యవహారాల్లోను, ఆరోగ్యవిషయం లోను, చాలా మెళకువ అవసరం. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఒకేసారి అనేక పనులు మీదపడటంతో ఒకింత అసహనానికి గురవుతారు. ఎదుటివారిని గమనించి ఎత్తుకు పై ఎత్తు వేయండి. స్త్రీలకు పనిభారం అధికం.
 
కన్య :- సినిమా కళాకారులకు అపవాదులు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. స్త్రీల అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. ఆత్మీయులను విమర్శించడం మంచిదికాదని గమనించండి. మీ అంతరంగిక విషయాలను బయటకు వ్యక్తం చేయకండి.
 
తుల :- ఉమ్మడి వ్యవహరాలు, ఆస్తి పంపకాలు ఒకకొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిత్రులవల్ల అపనిందలు, అపవాదులు ఎదుర్కొంటారు. నూతన పరిచయాలు, వ్యాపకాలు మీ పురోభివృద్ధికి నాందిపలుకుతాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది.
 
వృశ్చికం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. బంధువులరాకతో గృహంలో సందడి కానవస్తుంది. నిగ్రహం పాటించటం క్షేమదాయకం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. వాహనం, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
ధనస్సు :- కొంతమంది మిమ్ములను ఉద్రేకపరిచేలా సంభాషిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. రుణ, విదేశీయాన యత్నాల్లో ఆటంకాలెదుర్కుంటారు. కుటుంబ వ్యవహారాలలో కానీ శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. మతపమైన విషయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
 
మకరం :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. బంధువులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. రాజకీయనాయకులు తరుచు సభలు, యూనియన్ సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి.
 
కుంభం :- ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వివాదాస్పదమవుతుంది. కానివేళలో ఇతరుల రాకఇబ్బంది కలిగిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక కోసం అధిక సమయం వెచ్చిస్తారు.
 
మీనం :- అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.