శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

27-04-2023 తేదీ గురువారం దినఫలాలు - సాయిబాబాను ఆరాధించిన సంకల్పసిద్ధి...

Cancer
మేషం :- కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ఫ్యాన్సీ, బేకరీ, పండ్ల వ్యాపారుకు పురోభివృద్ధి. ఆలయాలను సందర్శిస్తారు. ముందుచూపుతో వ్యవహరించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
వృషభం :- హోటల్, తినుబండారాలు, బేకరీ, పండ్ల వ్యాపారులకు లాభదాయకం. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సత్సంబంధాలు నెలకొంటాయి. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహపరుస్తాయి. దైవ, సేవా సంస్థలకు విరాళాలివ్వటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
మిథునం :- దైవ దర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తప్పవు. స్త్రీలకు షాపింగ్ వ్యవహరాలు, అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థులు తోటివారి కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కొంతమంది మీ నుంచి విషయాలు రాబట్టేందుకు యత్నిస్తారు.
 
కర్కాటకం :- మీ అభిప్రాయం సున్నితంగా వ్యక్తం చేయటం శ్రేయస్కరం. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదని గమనించండి. మీ శ్రమ, యత్నాలు వృధా కావు. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు.
 
సింహం :- ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. విందులు, వినోదాల్లో అపశృతులు దొర్లే అవకాశం ఉంది. ప్రేమికులు అనాలోచితంగా వ్యవహరించటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. పెద్దలు పరోపకారానికి పోవటం వల్ల మాటపడవలసి వస్తుంది. బంధువులను కలుసుకుంటారు. ఊహించని ఖర్చు వల్ల చేబదుళ్ళుతప్పవు.
 
కన్య :- శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. మీ లక్ష్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ఇతరుల వ్యవహారాలలో మౌనం పాటించడం మంచిది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
తుల :- వాహన విషయంలో సంతృప్తి కానవస్తుంది. అదనపు రాబడి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. భాగస్వామ్యల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆరోగ్యం, ఆర్థిక వ్యవహరాలు ఆందోళన కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి.
 
వృశ్చికం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. స్త్రీలు నూతన వస్త్రాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. రాజకీయ నాయకులు తరచు సభ, సమావేశాలలో పాల్గొంటారు.
 
ధనస్సు :- మీ సంతానం వల్ల ఆనందం, ఉత్సాహం పొందుతారు. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవ దర్శనాలను తొరగా ముగించుకుంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందడంవల్ల ఆర్ధిక ఇబ్బంది అంటూఉండదు.
 
మకరం :- స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆశ్చర్యకరమైన వార్తలు అందుతాయి. సమయానికి సహకరించని వ్యక్తులవల్ల ఇబ్బందులెదుర్కుంటారు. కుటుంబీకుల నుండి సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఏకాగ్రత, స్వయం పర్యవేక్షణ ఎంతో ముఖ్యం.
 
కుంభం :- బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. భాగస్వామిక సమావేశాల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయటం మంచిది. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. స్త్రీలు ఇరుగు, పొరుగు వారితో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. మీకు దగ్గరగా ఉన్న, మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది.
 
మీనం :- రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకు అవసరం. మీ ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకొండి. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఒకేసారి అనేక పనులు మీద పడటంతో ఒత్తిడికి గురవుతారు.