30-08-2026 ఆదివారం ఫలితాలు - ప్రతికూలతలు అధికం
Daily horoscope
నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అనుకూలతలు నెలకొంటాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. పిల్లల దూకుడు అదుపు చేయండి.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు అధికం, కానీ ప్రయోజనకరం. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
చిత్తశుద్ధిని చాటుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. ఖర్చులు విపరీతం. చేసిన పనులే మళ్లీ చేయవలసి వస్తుంది. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిచయాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ముఖ్యులతో సంభాషిస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. పనులు సజావుగా సాగుతాయి. ధనసహాయం తగదు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే పొందుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. నోటీసులు అందుకుంటారు. గృహ మార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సన్నిహితులను కలుసుకుంటారు. ప్రయాణం తలపెడతారు.
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. ప్రలోభాలకు లొంగవద్దు. కొంత మొత్తం అందుతుంది. పనులు సాగక విసుగు చెందుతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సమర్థతను చాటుకుంటారు. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. పొదుపు ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోండి.
