28-08-2026 రాశి ఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు.. ధనలాభం వుంది..
Horoscope predictions
శుభకార్యానికి హాజరవుతారు. ఖరీదైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు చురుకుగా సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. కొత్త ప్రదేశం సందర్శిస్తారు.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆశావహ దృక్పథంతో శ్రమించండి. యత్నాలను కుటుంబీకులు ప్రోత్సహిస్తారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. ఆత్మీయుల ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. ఖర్చులు విపరీతం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. సన్నిహితులను కలుసుకుంటారు. చేసిన పనులే మళ్లీ చేయవలసి వస్తుంది. ఆహ్వానం అందుకుంటారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ముఖ్యమైన పనులతో తీరిక ఉండదు. సంప్రదింపులు సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఖర్చులు సామాన్యం. పత్రాల రెన్యూవల్‌లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ రోజు అనుకూలదాయకం. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. కొత్త పనులు చేపడతారు. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకున్న లక్ష్యం సాధిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ధనలాభం ఉంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ధార్మిక సంస్థలకు సాయం అందిస్తారు.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మాట నిలబెట్టుకుంటారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. వ్యవహార పరిజ్ఞానంతో రాణిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు వేగవంతమవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. దూర ప్రయాణం తలపెడతారు.
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పెద్ద మొత్తంలో ధనసహాయం తగదు. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సంప్రదింపులు జరుపుతారు. పోగొట్టుకున్న పత్రాలు, వస్తువులు లభిస్తాయి.
ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రతికూలతలు విపరీతం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నిస్తేజానికి లోనవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. రావలసిన ధనం సమయానికి అందదు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. వాహనదారులకు ఏకాగ్రత ప్రధానం.
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గృహ వాతావరణం చికాకు పరుస్తుంది. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు.
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆశావహ దృక్పథంతో మెలగండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. అపరిచితులతో జాగ్రత్త.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సంకల్పం సిద్ధిస్తుంది. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. పిల్లల ఉన్నత చదువులపై శ్రద్ధ చూపుతారు.
