ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (21:54 IST)

01-01-2025 నుంచి 31-01-2025 వరకు ఫలితాలు మీ మాస ఫలితాలు

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థిక విషయాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. స్థిరచరాస్తుల మూలక ధనం అందుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రముఖులకు కానుకలు అందిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వేడుకను ఘనంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. సంస్థలు, పరిశ్రమల స్థాపనకు మరికొంత కాలం వేచియుండటం ఉత్తమం. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ నిర్లక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. ముఖ్యమైన పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వస్త్ర వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ప్రయాణంలో ఒకింత అవస్థలు తప్పవు. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఈ మాసం అనుకూలదాయకం. మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆప్తులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. మీ జోక్యం అనివార్యం. వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూమవుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ప్రత్యర్థులను ఓ కంట కనిపెట్టండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందుల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమించండి. మీ కష్టం త్వరలో ఫలిస్తుంది. పరిస్థితులకు తగ్గట్టుగా మెలగండి. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు తగదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. కుటుంబసౌఖ్యం. ప్రశాంతత పొందుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదర్శనాల్లో అవస్థలెదుర్కుంటారు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం శుభాశుభాల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి ఖర్చుచేస్తారు. ద్వితీయార్ధం కొంతమేరకు యోగదాయకం. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా వ్యవహరిస్తారు. ఆశలు ఒదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఉపాధ్యాయుల శ్రమ ఫలిస్తుంది. అధికారుల ప్రశంసలందుకుంటారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సాఫ్ట్‌వేర్ విద్యార్థులకు సదావకాశాలు లభిస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాల్లో స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం బాగుంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదవీయోగం. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు
కీలక విషయాలపై పట్టుసాధిస్తారు. మీ ఆధిపత్యం కొనసాగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పలు కార్యక్రమాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. కానుకలు, పురస్కారాలు అందుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. దంపతుల మధ్య అనురాగవాత్యల్యాలు వెల్లివిరుస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు లాభసాటిగా, సాగుతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వాహనదారులకు దూకుడు తగదు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. పరిచయాలు బలపడతాయి. ప్రముఖులకు కానుకలు అందిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఆప్తులను విందులు, వేడుకకు ఆహ్వానిస్తారు. వ్యవహారాలతో తలమునకలవుతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యత ఏకాగ్రత వహించండి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
మీ సంకల్పబలమే కార్యసిద్ధికి తోడ్పడుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కానుకలు, ప్రశంసలు అందుకుంటారు. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు పదవీయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ రంగాల్లో శుభ ఫలితాలున్నాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళకలు వేసుకుంటారు. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. కొత్త వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆప్తులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగపరంగా మరింత శ్రద్ధగా పనిచేయండి. మీ సమర్ధతను అధికారులు గుర్తిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను తట్టుకుంటారు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఆచితూచి అడుగేయండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. పెద్దల సలహా తీసుకోండి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రముఖులకు కానుకలు సమర్పించుకుంటారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకలు, విందులకు హాజరవుతారు. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. ఉపాధ్యాయుల శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. పరిస్థితులు చక్కబడతాయి. రావలసిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ప్రముఖులకు కానుకలు అందిస్తారు. గౌరవప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు రూపొందించుకుంటారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంతానానికి శుభఫలితాలున్నాయి. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభి సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకోండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సంఘటన మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఆత్మీయులతో సంభాషణ కొత్త యత్నాలకు ప్రేరేపిస్తుంది. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రిప్రజెంటేటివ్‌లు లక్ష్యాలను సాధిస్తారు. వేడుకకు హాజరవుతారు. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.