శనివారం, 30 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Modified: మంగళవారం, 31 మే 2022 (23:02 IST)

01-06-2022 నుంచి 30-06-2022 వరకూ మీ మాస ఫలితాలు

June month rasi phalalu
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. ఆదాయం బాగున్నా సంతృప్తి వుండదు. పెరిగిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సన్నిహితుల సాయంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తుల వారికి కష్టకాలం. భవన నిర్మాణ కార్మికులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. న్యాయ వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.

 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు సామాన్యం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వ్యవహారాలతో తీరిక వుండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహా పాటించండి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహ మరమ్మతులు చేపడతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది.

 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. తొందరపడి హామీలివ్వవద్దు. ఆదాయం సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు తరుణం కాదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. జాతకపొంతన ప్రధానం. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. గృహమార్పు కలిసివస్తుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ఆరోగ్యం మందగిస్తుంది. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.

 
కర్కాటక రాశి: పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం అన్ని విధాలా శుభదాయకమే. వాగ్దాటితో రాణిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. స్థిరాస్తి క్రయవిక్రయంలో మెలకువ వహించండి. ప్రియతములు గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.

 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలంగా వుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణబాధలు కొంతమేరకు తగ్గుతాయి. బాధ్యతగా వ్యవహరిస్తారు. బంధుమిత్రులకు మీపై ప్రత్యేకాభిమానం నెలకొంటుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ప్రధానం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయంలో మెలకువ వహించండి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సంతానం విదేశీయత్నం ఫలించదు.

 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. కొంతమంది మీ ఆలోచనలు నీరుగారుస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిస్తాయి. రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. కనిపించకుండాపోయిన వస్తువులు లభ్యమవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహమార్పు అనివార్యం. భవన నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులకు కష్టకాలం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిన్నవ్యాపారులకు ఆశాజనకం. ఉపధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు హోదామార్పు. సేవా, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలతో తీరిక వుండదు. ఖర్చులు విపరీతం. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు మందకొండిగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. వివాదాలు సద్దుమణుగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

 
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
శుభవార్తలు వింటారు. మనస్సు ప్రశాంతంగా వుంటుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది వుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ సాయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కుటుంబ, ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.

 
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం అనుకూలదాయకమే. మాట నిలబెట్టుకుంటారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. అయినవారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. కార్మికులకు పనులు లభిస్తాయి. విదేశీ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు.

 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆర్థికంగా బాగున్నా సంతృప్తి వుండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా తెలియజేయండి. మొహమాటాలకు, భేషజాలకు పోవద్దు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు ప్రలోభాలకు పోవద్దు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.

 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది. అవివాహితులకు శుభయోగం. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. వ్యవసాయ రంగాల వారికి కష్టకాలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు.

 
మీన రాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఈ మాసం ప్రధమార్థం అనుకూలదాయకం. కష్టానికి తగ్గ ప్రతిఫలం వుంది. ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయం సంతృప్తికరం. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. వ్యవహారాలతో తీరిక వుండదు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరమవుతాయి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. పనివారలతో జాగ్రత్త. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం, పదోన్నతి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.