09-05-2021 నుంచి 15-05-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

Rashi Phalalu
రామన్| Last Modified ఆదివారం, 9 మే 2021 (13:20 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అదుపులో వుండవు. ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు. శుక్ర, శని వారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పిల్లల పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. దంపతుల మధ్య సఖ్యతలోపం. సామరస్యంగా మెలగండి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.

వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. సాయం ఆశించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆదివారం నాడు అప్రమత్తంగా వుండాలి. వాగ్వాదాలు, అనవసర జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు.

మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత వుండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి వుండదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. సోమ, మంగళ వారాల్లో ఒక సంఘటన ఆందోలన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రముఖుల సదర్శనం కోసం పడిగాపులు తప్పవు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. నష్టాలను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం సంతృప్తికరం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థుల కదలికలు గమనించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బుధవారం నాడు పనులతో సతమతమవుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీపై శకునాల ప్రభావం అధికం. మనోధైర్యంతో ముందుకు సాగండి. దంపతుల దాపరికం తగదు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. కార్మికులు, చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు పదోన్నతి, స్థానచలనం. వ్యాపారాల్లో గణనీయన పురోగతి సాధిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. ధనలాభం వుంది. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. శుభకార్యానికి హాజరుకాలేరు. బంధుమిత్రులతో స్పర్థలు తలెత్తుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. గురు, శుక్ర వారాల్లో పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. వ్యతిరేకులతో జాగ్రత్త. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. మీపై శకునాల ప్రభావం అధికం. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలించవు. వైద్య రంగాల వారి ఆదాయం బాగుంటుంది.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం సంతృప్తికరం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. సంస్థల స్థాపనకు అనుకూలం. వేడుకకు హాజరవుతారు. బంధుత్వాలు బలపడతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. ఆది, గురు వారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. చిరువ్యాపారాలు బాగుంటాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు.

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. అనుభవజ్ఞుల మాటకు విలువ ఇవ్వండి. ఆదాయవ్యయాలకు పొంతన వుండదు. ఊహించని ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. శనివారం నాడు పనులు సాగవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఓర్పుతో వ్యవహరించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. వృత్తి ఉపాధి పథకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. ప్రయాణం విరమించుకుంటారు.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
ఈ వారం ప్రతికూలతలు అధికం. మనస్థిమితం వుండదు. ఆలోచనలతో సతమవుతారు. ఖర్చులు అదుపులో వుండవు. డబ్బుకు ఇబ్బందిగా వుంటుంది. అవసరాలు నెరవేరవు. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. దంపతుల మధ్య సఖ్యతాలోపం. ప్రియతములతో సంభాషణ మనశ్శాంతినిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.

ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
అవకాశాలు కలిసివస్తాయి. సమర్థతను చాటుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. బాధ్యతగా వ్యవహరించండి. ఖర్చులు అధికం. పొదుపు ధనం అందుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. మీ సలహా ఆప్తులకు కలిసివస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ పథతాలు మున్ముందు సత్పలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు ఆకస్మిక స్థానచలనం. వృత్తుల వారికి సామాన్యం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సంతోషకరమైన వార్తలు వింటారు. మీ కృషి ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఊహంచిన ఖర్చులే వుంటాయి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. సోమ, మంగళ వారాలలో అప్రమత్తంగా వుండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలివేయండి. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ధార్మిక సంస్థలకు సాయం అందిస్తారు. నిరుద్యోగలుక ఉద్యోగ యోగం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. భాగస్వామి వ్యాపారాలు కలిసివస్తాయి. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి.

కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. ఉల్లాసంగా గడుపుతారు. వివాహ యత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. బంధుత్వాలు బలపడతాయి. బుధ, గురు వారాల్లో పనులతో సతమతమవుతారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం సంతృప్తికరం. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా వ్యవహరించాలి. పొగడ్తలు, ప్రలోభాలకు లొంగవద్దు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఆప్తులకు కలిసివస్తుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణంలో ఒకింత అవస్తలు తప్పవు.

మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. అసాధ్యమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులతో జాగ్రత్త. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. శుక్ర, శని వారాల్లో పత్రాలు, నగదు జాగ్రత్త. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిపెడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. కార్మికులు, చేతి వృత్తు వారికి సామాన్యం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.దీనిపై మరింత చదవండి :