బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Modified: శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (22:30 IST)

01-05-2021 నుంచి 31-05-2021 వరకూ మీ మాస ఫలితాలు

మేషరాశి: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అన్ని రంగాల వారికి కలిసివచ్చే సమయం. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా వుంటుంది. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. పట్టుదలతో శ్రమిస్తేనే పనులు సానుకూలమవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. సందేశాలు, ప్రకటనలు విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభ రాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేతిలో ధనం నిలవదు. ఆలోచనలతో సతమతమవుతారు. మనస్థిమితం వుండదు. ఆప్తులతో కాలక్షేపం చేసేందుకు యత్నించండి. అవకాశాలు అందినట్లే అంది చేజారిపోతాయి. ఆశావహ దృక్పథంతో మెలగండి. సన్నిహితుల హితవు మీపై సత్ర్పభావం చూపుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. పోగట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ముఖ్యం. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వాహనం ఇతరులకివ్వవద్దు.
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్య ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. అవసరాలు అతి కష్టమ్మీద నెరవేరుతాయి. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. పెద్దల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. విలువైన వస్తువులు, ఆభరణాలు జాగ్రత్త. గృహమార్పు కలిసివస్తుంది. పిల్లల విషయంలో శుభ ఫలితాలున్నాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. కార్మికులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఈ మాసం అనుకూలదాయకం. కార్యసిద్ధి, ధన యోగం వున్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది వుండదు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు అనుకూలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. పత్రాలు అందుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. గృహం సందడిగా వుంటుంది. శుభకార్యానికి హాజరు కాలేరు. బంధువుల మాటతీరు కష్టమనిపిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలను అందుకుంటారు. ఉపాధి పథకాలు చేపడతారు. ఆధ్మాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఊహించని ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. ధనసహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. వ్యవహారానుకూలత అంతంతమాత్రమే. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. మీ అసక్తతను అయినవారు అర్థం చేసుకుంటారు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. అధికారులకు హోదా మార్పు, స్థాన చలనం. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్పలితాలిస్తాయి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ద్విచక్రవాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం.
 
తులా రాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు అనుకూలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. ఖర్చులు అధికం. డబ్బుకు లోటు వుండదు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఇంటి విషయాలు పట్టించుకోండి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. అధికారులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు ఆందోళన అధికం. ప్రయాణం కలిసివస్తుంది.
 
వృశ్చిక రాశి: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. సాయం చేసేందుకు అయినవారే వెనకాడతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. సన్నిహితుల హితవు మీపై ప్రభావం చూపుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. ఆహ్వానం అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం పైచదువులను వారి ఇష్టానికే వదిలేయండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గృహమార్పు అనివార్యం. పోగొట్టుకున్న పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి.
 
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం ఆశాజనకం. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. దుబారా ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. ఆత్మీయుల సాయం అందిస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పనివారలు, కొనుగోలుదార్లతో జాగ్రత్త. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారాలతో తలమునకలవుతారు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. చాకచక్యంగా మెలగాలి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఆప్తుల సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన వండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. పొదపు ధనం ముందుగానే గ్రహిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం సంతృప్తికరం. సంస్థల స్థాపనకు అనుకూలం. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. ముఖ్యులకు వీడ్కోలు, స్వాగతం పలుకుతారు. 
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వివాహ యత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. గృహం సందడిగా వుంటుంది. పనులు సానుకూలమవుతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. అందరితో సఖ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువగా అంచనా వేయవద్దు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, సేవా సంస్తలకు విరాళాలు అందిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు శుభయోగం. ఉపాది పథకాలు సామాన్యంగా సాగుతాయి. నూతన కార్యకలాపాలకు అనుకూలం. దైవ కార్యంలో పాల్గొంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు.
 
మీనరాశి: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమస్యలపై దీటుగా స్పందిస్తారు. తప్పిదాలు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సోదరలు మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. గృహమార్పు అనివార్యం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆదయం బాగుంటుంది. వృత్తి, ఉపాది పథకాల్లో నిలదొక్కుకుంటారు. భవన నిర్మాణ కార్మికలకు సదవకాశాలు లభిస్తాయి. విదేశాలలో ఆత్మీయలతో సంభాషిస్తారు.