18-04-2021 నుంచి 24-04-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

Rashi Phalalu
రామన్| Last Modified శనివారం, 17 ఏప్రియల్ 2021 (22:21 IST)
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అనుకూలతలు అంతంతమాత్రమే. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా వుండవు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆత్మీయుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సంయమనం పాటించండి. మీ తీరు మార్చుకోవడం శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.

వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. పట్టుదలతో యత్నాలు సాగించండి. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఊహించని ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. బుధ, గురు వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారాలకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.

మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారానుకూలత వుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనమూలక సమస్యలు కొలిక్కి వస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శని వారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. వేడుకకు హాజరవుతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం బాగుంటుంది. భూ సంబంధిత వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. ఆహ్వానాలు, పత్రాలు అందుకుంటారు. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు, పనులు అప్పగించవద్దు. ఆత్మీయుల రాక ఉల్లాసాన్నిస్తుంది. వివాహ యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నిరుద్యోగులకు శుభదాయకం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. భాగస్వామిక వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. ఆదాయం బాగుంటుంది. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సమర్థతను చాటుకుంటారు. పదవుల స్వీకరణకు మార్గం సుగమమవుతుంది. సాధ్యం కాని హామీలివ్వవద్దు. సోమ, బుధ వారాలలో బాధ్యతగా వ్యహరించాలి. పనులు త్వరితగతిన పూర్తి కాగలవు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సంగడిగా వుంటుంది. మీ జోక్యం అనివార్యం. ఇరువర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. వేడుకకు హాజరవుతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు యూనియన్ వ్యవహారాల్లో తలమునకలవుతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వాయిదా పడిని మొక్కులు తీర్చుకుంటారు.

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆలోచనల్లో మార్పు వస్తుంది. సన్నిహితుల సలహా పాటిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం చేసేందుకు అయినవారే వెనుకాడతారు. గురు, శుక్ర వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. అపరిచితులతో జాగ్రత్త. ఇంటి విషయాలు గోప్యంగా వుంచండి. అనవసర జోక్యం తగదు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారాలు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. వివాహ యత్నం ఫలిస్తుంది. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి అధికం. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహనలోపం. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. పంతాలు, పట్టుదలకు పోవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. బ్యాంకు వ్యవహారాల్లో మెలకువ వహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
నిజాయితీగా మెలిగి ప్రశంసలందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. ఆది, సోమ వారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. గృహ మరమ్మతులు చేపడతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. రిప్రజెంటేటివ్ లు టార్గెట్లు అధిగమిస్తారు. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా వుంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉల్లాసంగా గడుపుతారు. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మంగళ, బుధ వారాల్లో విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వేడుకకు హాజరవుతారు.

మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ వారం అనుకూలదాయకం. మాట నిలబెట్టుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. సమర్థతకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ధన వ్యయం విపరీతం. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. మీ ప్రమేయంతో ఒకరికి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. న్యాయ, సేవా, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు కొత్త మలుపు తిరుగుతాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. సకాలంలో చెల్లింపులు జరిపేందుకు ప్రయత్నించండి. ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయుల రాకతో కుదుటపడతారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. చేనేత పరిశ్రమల వారికి ఆశాజనకం. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి.

మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. మీ నమ్మకం వమ్ము కాదు. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే వుంటాయి. వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆది, గురు వారాల్లో ముఖ్యుల సందర్శనం వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వాహనయోగం, వస్తులాభం వున్నాయి. పిల్లల చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు తప్పకపోవచ్చు. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. ప్రయాణంలో ఒకింత అవస్తలు తప్పవు.దీనిపై మరింత చదవండి :