బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (23:11 IST)

25-04-2021 నుంచి 01-05-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలు తొలగుతాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. త్వరలో సమస్యలు సద్దుమణుగుతాయి. గృహం ప్రశాంతంగా వుంటుంది. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. సోమ, మంగళ వారాల్లో వాగ్వాదాలకు దిగవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. పెరిగిన ధరలు ఆందోళనకు గురి చేస్తాయి. అవసరాలకు అతి కష్టమ్మీద ధనం సర్దుబాటవుతుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలించవు. ప్రయాణం చికాకు పరుస్తుంది.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం వుండదు. అవకాశాలు చేజారిపోతాయి. నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆప్తుల సలహా పాటించండి. దంపతుల మధ్య సఖ్యతలోపం. సంయమనంతో మెలగండి. సంతానం విషయంలో శుభపరణామాలున్నాయి. బుధవారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారులకు కష్టకాలం. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు ఊహించని సంఘటనలెదురవుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఈ వారం యోగదాయకమే. కార్యసిద్ధి, ధనలాభం వున్నాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆపన్నులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆశావహ దృక్పధంతో వ్యవహరించండి. మీ జోక్యం అనివార్యం. ఇరువర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహంలో మార్పుచేర్పులు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. అధికారులకు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఒక సమాచారం ఉత్సాహపరుస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలివ్వవద్దు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. స్థిరాస్థి క్రయవిక్రయంలో మెలకువ వహించండి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. విదేశాల్లో ఆప్తుల క్షేమం తెలుసుకుంటారు. సంతానం దూకుడు అదుపుచేయండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే వుంటాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన ముఖ్యం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గురు, శుక్ర వారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. గృహ మరమ్మతులు చేపడతారు. చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. శనివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పత్రాలు అందుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. చిన్ననాటి పరిచయస్తులతో ముచ్చటిస్తారు. గత సంఘనలు అనుభూతినిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వేడుకకు హాజరు కాలేరు. బంధువులతో విభేదలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు కొత్త సమస్యలెదురవుతాయి. ప్రముఖులకు అభినందనలు తెలియజేస్తారు. పందాల జోలికి పోవద్దు.
 
తుల: చిత్త, 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. గృహం సందడిగా వుంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ద్విచక్ర వాహనచోదకులకు దూకుడు తగదు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3 పాదాలు
ఈ వారం కలిసివచ్చే సమయం. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్ని కలిగిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా మెలగండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలను సమర్థంగా ఎదుర్కొంటారు. పెద్దమొత్తం సరకు నిల్వ తగదు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాలు అనుకూలిస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. ఆది, సోమ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి పెడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. ముఖ్యులకు స్వాగతం, వీడ్కోలు పలుకుతారు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఆప్తులను కలుసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. మంగళ, బుధ వారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఇతరులను మీ విషయాలకు దూరంగా వుంచండి. గృహమార్పు అనివార్యం. సంతానం చదువులపై మరింత శ్రద్ద వహించాలి. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రయాణం తలపెడతారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపజేస్తుంది. జాతక పొంతన అనివార్యం. తొందరపడి మాట ఇవ్వద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. గురువారం నాడు పనులు సాగవు. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే వుంటాయి. డబ్బుకు ఇబ్బంది వుండదు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సంతానం విషయంలో మంచి ఫలితాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాగ్దాటితో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో వుండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. శని, ఆది వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు హోదా మార్పు, స్థానం చలనం. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ధీటుగా ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.