ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-04-2021- ఆదివారం మీ రాశి ఫలితాలు- మీ ఉన్నతిని చూసి..?

సూర్య నారాయణ పారాయణ చేసినట్లైతే అన్నివిధాలా కలిసివస్తుంది. 
 
మేషం: ఉద్యోగస్తులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వస్తువుల పట్ల అప్రమత్తత ఎంతో అవసరం. స్త్రీలకు పనిభారం అధికమవ్వడం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. 
 
వృషభం: మీ కళత్ర మొండి వైఖరి వల్ల కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైన శ్రద్ధ వహించండి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మార్పులు అనుకూలిస్తాయి. 
 
మిథునం: వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని వుండటం శ్రేయస్కరం. పెంపుడు జంతువు గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు ఆర్థికపరమైన సమస్యలు అధికమవుతాయి. ఎంత ధనం వెచ్చించైనా కోరుకున్న వస్తువు దక్కించుకుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడుతుంది. రేషన్ డీలర్లకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
సింహం: గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఊహించని ఖర్చులు ఎదురైనా ఇబ్బందులు అంతగా వుండవు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా వుంటుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. 
 
కన్య: మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. స్త్రీలు షాపింగ్‌లో బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు.
 
తుల: ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి సాధిస్తారు. ఉపాధ్యాయులు మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. అందరితో కలిసి విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. 
 
వృశ్చికం: సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. బంధుత్వాల మధ్య ఏర్పడిన సందిగ్ధ పరిస్థితులు తీరిపోతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలు కోపంతో పనులు చక్కబెట్టలేరు.
 
ధనస్సు: మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. రుణ యత్నాలు కొంత పురోగతి కనిపిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. పెద్దల ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా వుండండి. దూర ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
మకరం: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. ఖర్చులు అధికమవుతాయి. అకాల భోజనం, శ్రమాధిక్యత పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.
 
కుంభం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకు ఎదురైనా అధిగమిస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఆత్మీయులతో కలిసి విహార యాత్రల్లో పాల్గొంటారు. 
 
మీనం: విందులలో పరిమితి పాటించండి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. రాజకీయ నాయకులకు ఆకస్మికంగా దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని, పానీయ వ్యాపారులకు లాభదాయకం. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.