సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-04-2021 మంగళవారం దినఫలాలు - లక్ష్మీనారాయణ స్వామిని పూజించినా...

మేషం : దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం విరివిగా వెచ్చిస్తారు. ధనవ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెళకువ వహించండి. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి వల్ల అనుకోని ఇబ్బందులెదుర్కొంటారు. దంపతుల మధ్య దాపరికం అనర్థాలకు దారితీస్తుంది. కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. 
 
వృషభం : వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. రవాణా రంగంలోని  వారు చికాకులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మార్పులు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి.
 
మిథునం : వస్త్రం, బంగారం, వెండి, లోహ, గృహోపకరణాల వ్యాపారులకు కలిసిరాగలదు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అలౌకి విషయాలు, ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
కర్కాటకం : సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రులను కలుసుకుంటారు. విలాసాలకు, ఆడంబరాలకు వ్యయం చేసే విషయంలో ఆలోచన, పొదుపు అవసరం. ప్రేమికుల తొందరపాటుతనం అనర్థాలకు దారితీస్తుంది. స్త్రీలకు కొత్త వ్యాపకాలు, ఆలోచనలు స్ఫురిస్తాయి. విదేశీయాన యత్నాల్లో జాప్యం తప్పదు.
 
సింహం : దైవ, సాంఘిక, సేవా కార్యక్రమాల పట్ల శ్రద్ధ కనపరుస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. భాగస్వామిక చర్చలు, ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ అవసరం. స్త్రీల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు శారీరక పటుత్వం నెలకొంటుంది. ఒక స్థిరాస్తి అమర్చుకునేందుకు తీవ్రంగా యత్నిస్తారు. 
 
కన్య : కొబ్బరి, పండ్లు, పూల చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్యం ఒప్పందాల్లో పెద్దల సలహా పాటించడం మంచిది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. 
 
తుల : పత్రికా సంస్థలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. దైవ కార్యాలకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. 
 
వృశ్చికం : ఏసీ, కూలర్, ఇన్వెర్టర్ల  వ్యాపారులకు లాభదాయకం. ప్రతిచిన్న విషయానికి ఇతరులపై ఆధారపటం మంచిదికాదు. ఎదుటివారిని తక్కువ అంచనా వేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ధనం పొదుపు చేయాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. మీ కోపాన్ని చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిదికాదు. 
 
ధనస్సు : రాజకీయ, కళారంగాల వారికి సన్మానం జరిగే అవకాశం ఉంది. రుణయత్నాల్లో స్వల్ప ఆటంకాలు తొలగిపోతాయి. భాగస్వాములతో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. అక్రమ సంపాదనల వైపు దృష్టి సారించక పోవడం మంచిది. పెద్దల వల్ల సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలకు స్వీయ అర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. 
 
మకరం : ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల సందడి మంచి ఆదరణ లభిస్తుంది. దైవకార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆత్మీయుల దూరవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించేవారుండరు. 
 
కుంభం : పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి వహిస్తారు. ఏదైనా అమ్మటానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడటం మంచిది. మీ పథకాలు, ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. 
 
మీనం : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలకు రచనలు, సమాజ సేవ పట్ల ఆసక్తి పెరుగుతుంది. కిరాణా ఫ్యాన్సీ, మందులు, స్టేషనరీ, విత్తన వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆర్థికాభివృద్ధి కానవస్తుంది. రావలసిన ధనం అందటంతో నిర్మాణ కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి.