మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-04-2021 మంగళవారం దినఫలాలు - సంకల్పసిద్ధి కోసం గణపతిని ఆరాధిస్తే...

మేషం : బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మందలింపులు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. 
 
వృషభం : వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. కాని వేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
మిథునం : ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది. రావలసిన ధనం చేతికి అందడంతో రుణం కొంత తీర్చగలుగుతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. గత విషయాలు జ్ఞప్తికి  రాగలవు. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. 
 
కర్కాటకం : కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ఒక వేడుకను ఘనంగా చేయడానికి సన్నాహాలు మొదలుపెడతారు. మార్కెటింగ్ రంగాలలో వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. 
 
సింహం : కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి. చిన్నతరహా, చిరు వ్యాపారులకు ప్రతిపనిలోనూ శ్రద్ధ వహించుట వల్ల జయం చేకూరుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఎదురవుతుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. స్థిరచరాస్తుల విషయమై కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
 
కన్య : మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఫలిస్తుంది. మీ శ్రీమతితో వచ్చిన మార్పు మీకెంతో సంతృప్తినిస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక్కసారి ప్రేమిస్తే ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎంతైనా పోరడాతారు. 
 
తుల :  బకాయిలు, నెలసరి వాయిదాల వసూళ్ళలో కలెక్షన్ ఏజెంట్లు లౌక్యంగా మెలగాలి. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు వాయిదాపడతాయి. విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళన వంటివి ఎదుర్కొంటారు. 
 
వృశ్చికం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. పాతబాకీలు వసూలవుతాయి. మీ సోదరి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇతరుల జోక్యం వల్ల మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీలకు పనిభారం అధికం. ప్రయత్నపూర్వకంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయి.
 
ధనస్సు : ఆదాయంలో చక్కని అభివృద్ధి కనిపిస్తుంది. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత ముఖ్యం. ప్రముఖుల పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు ఎదుర్కొంటారు. 
 
మకరం : ఒక వ్యవహారం నిమిత్తం ఫ్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దమొత్తం నగదు, ఆభరణాలతో ప్రయాణం శ్రేయస్కరంకాదు. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. బంధువులు, ఆత్మీయుల అందరిరాక సంతోషం కలిగిస్తుంది. శాంతియుతంగా మీ సమస్యను పరిష్కరించుకోవాలి. 
 
కుంభం : స్త్రీలకు అర్చన పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. దూర ప్రయాణాలలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. స్థిరాస్తి ఏదైనా అమ్మకం చేయాలనే మీ ఆలోచ వాయిదాపడుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
మీనం : స్త్రీలకు అలంకరణలు, విలాస వస్తువులు పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు, అనుభవం గడిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పెరిగే సూచనలు ఉన్నాయి.