శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-04-2021 గురువారం దినఫలాలు - రాఘవేంద్ర స్వామిని పూజిస్తే సర్వదా శుభం...

మేషం : మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. రిప్రజెంటేటివ్‌లు, పత్రికా రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు క్రమశిక్షణ, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. 
 
వృషభం : బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ చిన్నారుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్థిరచరాస్తుల విక్రయంలో పునరాలోచన మంచిది. సంఘంలో మీ మాటకు మంచిపేరు, ఖ్యాతి లభిస్తుంది. స్త్రీలు సరదాలు, అవసరాలు వాయిదావేసుకోవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మిథునం : ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. వ్యాపారాభివృద్ఖికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడుతారు. స్త్రీల ఆహార విషయంలో వేళ తప్పి భుజించుట వల్ల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. అక్రమ సంపాదనల వైపు దృష్టిసారించకపోవడం మంచిది. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. 
 
కర్కాటకం : కొంతమొత్తం సాయం చేసి వారిని సంతృప్తిపరచండి. గృహోపకరణ వ్యాపారాలు, వేగం పుంజుకుంటాయి. ప్రభుత్వ సంస్థల్లోవారికి ఆశించినంత గుర్తింపు లభించదు. మిత్రులతో సంభాషించడం వల్ల మీలో మానసిక ధైర్యం, కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. 
 
సింహం : ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలు ముందుకుసాగక నిరుత్సాహం చెందుతారు. కుటుంబీకులతో ఏకీభవించలేకపోతారు. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. 
 
కన్య : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఫైనాన్స్, ఛిట్‌‌ఫండ్ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ఇంటాబయట సమస్యలు తలెత్తినా తెలివితేటలతో పరిష్కరించగలుగుతారు. మీ అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దడం మంచిదికాదని గమనించండి. 
 
తుల : స్టేషనరీ ప్రింటింగ్ రంగాలవారికి శుభం చేకూరుతుంది. నూతన పరిచయాలేర్పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడాల్సి వస్తుంది. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. కొత్త పనులు ప్రారంభించడంలో అడ్డంకులు ఎదురవుతాయి. వాహనం వీలైనంత నిదానంగా నడపడం మంచిది. 
 
వృశ్చికం : చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువులతో రాక గృహంలో సందడి కానవస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రసాయన, ఆల్కహాల్, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. మీరు దేనిని నమ్ముతారో ఆ విషయమైన ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి. రుణాలు తీర్చుతారు. 
 
ధనస్సు : నూనె, మిర్చి, ఆవాలు, పసుపు, వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. స్త్రీలకు ఇరుగు, పొరుగువారితో సఖ్యత అంతగా ఉండదు. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. 
 
మకరం : వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని అవకాశాలు వస్తాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుట వల్ల ఆందోళన పెరుగుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సమాచారం లోపం వల్ల ఒక అవకాశం చేజారిపోతుంది. 
 
కుంభం : రాజకీయాలలోని వారికి ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
మీనం : ఆర్థిక సమస్యలు తలెత్తుటవల్ల ఆందోళన చెందుతారు. స్త్రీలకు ఆహార, ఆరోగ్యంలో జాగ్రత్తలు అవసరం. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి భవిష్యత్ ప్రణాళికలను గురించి జీవిత భాగస్వామితో చర్చిస్తారు.