16-04-2021 శుక్రవారం దినఫలాలు - హనుమాన్ చాలీసా పఠించడం వల్ల...

Mesha Raashi

మేషం : పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. రావలసిన ధనం చేతికందుతుంది. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్, కంప్యూటర్, వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి పెరుగును. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. 
 
వృషభం : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రముఖులను కలుసుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
మిథునం : ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి, క్రయ విక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. మీ వ్యక్తిగత విషయాలు బయటకు తెలియజేయకండి. వాహనం నడుపునపుడు మెళకువ, ఏకాగ్రత అవసరం. స్త్రీలతో మితంగా సంభాషించండి. 
 
కర్కాటకం : తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల వల్ల సమస్యలు తలెత్తినా బంధువుల సహకారం వల్ల సమసిపోతాయి. రాజకీయ నాయకులకు మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
సింహం : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
: ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. వాగ్వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. పెంపుడు జంతువులపట్ల ఆసక్తి చూపుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. 
 
తుల : రిజర్వేషన్ రంగాల వారు సంతృప్తిని పొందుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
వృశ్చికం : ఆర్థిక లావాదేవీలు, ఆస్తి వ్యవహరాలు ఒక కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంది. ప్రముకుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారికి అచ్చు తప్పులుపడుట వల్ల మాట పడవలసి వస్తుంది. అక్రమ సంపాదనలపై దృష్టి సారించకపోవడమే మంచిది. 
 
ధనస్సు : అనవసర ప్రసంగం వల్ల అధికారులతో అవగాహన కుదరకపోవచ్చు. భాగస్వామిక వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. దూర ప్రయాణాలలో వస్తువులు పట్ల మెళకువ అవసరం. 
 
మకరం : కుటుంబీకులతో ముభావంగా ఉంటారు. మంచికిపోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. రాజకీయ రంగాల వారికి పర్యటనలు అధికమవుతాయి. 
 
కుంభం : దైవ, సేవా కార్యక్రమాలకు ఇతోధికంగా సహకరిస్తారు. పత్రికా, వార్తా సంస్థలలోని వారికి తోటివారితో ఇబ్బందులు తలెత్తుతాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు నిశ్చింత కలిగిస్తాయి. ఆదాయానికి మంచిన ఖర్చులెదురైనా ఇబ్బందులు ఉండవు. వాయిదాపడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. 
 
మీనం : ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాలవారికి ఒత్తిడి అధికం. సోదరీ, సోదరుల మధ్య ఏకాగ్రతాలోపం అధికమవుతుంది. స్త్రీలకు అలంకారాలు, విలువైన వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కొత్త షేర్ల కొనుగోళ్ళలో పునరాలోచన అవసరం. రుణం పూర్తిగా తీర్చి తాకట్లు విడిపించుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చుట్టుముడుతాయి. 


வெப்துனியா செய்திகள் உடனுக்குடன்!!! உங்கள் மொபைலில்... இங்கே க்ளிக் செய்யவும்
దీనిపై మరింత చదవండి :