గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అయోధ్య రామాలయం
Written By వరుణ్
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (10:57 IST)

తండ్రిని చంపిన తనయుడు.. మృతదేహాన్ని 32 ముక్కలు చేసి బోరులో పడేశాడు..

karnataka youth
ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే బెంగుళూరులో మరో హత్య జరిగింది. ఇక్కడ కన్నతండ్రిని కన్నబిడ్డ చంపేశాడు. ఆ తర్వాత కసి తీరకపోవడంతో మృతదేహాన్ని 32 ముక్కలు చేశాడు. పైగా, పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకకుండా మృతదేహాన్ని 32 ముక్కలను తమ వ్యవసాయ బోరుబావిలో పడేశాడు. ఈ నెల 6వ తేదీన జరిగిన ఈ దారుణ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
మృతుడు పరశురామ్ అనే పచ్చి తాగుబోతు. ప్రతిరోజూ పీకల వరకు మద్యం సేవించి భార్యను, పిల్లలను తిట్టేవాడు. కన్నతండ్రి వేధింపులు భరించలేక భార్య, పెద్ద కుమారుడు వేరే ఇంటిలో నివసిస్తుంటారు. చిన్న కుమారుడు విఠల తన తండ్రితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఫుల్లుగా మద్యం సేవించి వచ్చిన పరశురామ్ చిన్న కుమారుడు విఠల్‌ను కూడా బండ బూతులు తిట్టాడు. 
 
వీటిని భరించలేని విఠల్.. ఇనుపరాడ్డుతో తండ్రిని కొట్టడంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని 32 ముక్కలు చేసి... వాటిని తీసుకెళ్లి మంతూరు బైపాస్ రోడ్డు వద్ద వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. విఠల్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.