Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

కలబంద జ్యూస్‌తో అధిక బరువుకు చెక్...

చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ శరీర బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ముఖ్యంగా, ఉదయాన్నే నిద్రలేచి కిలోమీటర్లు కిలోమీటర్లు రన్నింగ్ చేస్తుంటారు.

Written By pnr
Updated: గురువారం, 30 నవంబరు 2017 (14:11 IST)
చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ శరీర బరువును తగ్గించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ముఖ్యంగా, ఉదయాన్నే నిద్రలేచి కిలోమీటర్లు కిలోమీటర్లు రన్నింగ్ చేస్తుంటారు. ఇలాంటి అలోవెరా (కలబంద) జ్యూస్‌ లేదా గుజ్జును క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఉదయం సేవిస్తే ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెపుతున్నారు. 
 
కలబంద జ్యూస్‌లో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరం లోపల, బ‌య‌ట‌, అవయవాల చుట్టూ ఏర్పడే కొవ్వును కరిగిస్తాయి. కలబంద రసంలో ఉండే ఫైటోస్టెరోల్స్ అంతర్గతంగా జీవక్రియ రేటును రెట్టింపు చేస్తాయి. ఫలితంగా శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలు ఈ జీవక్రియలో వినియోగించబడతాయి. దీంతో కొవ్వు క‌రిగి శరీర బరువు త‌గ్గుతుంది. 
 
ప్రతి రోజూ ఒక క‌ప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ కలబంద రసం, ఒక టీస్పూన్‌ అల్లం ర‌సం క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి. దీంతో అతి త‌క్కువ స‌మ‌యంలోనే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇలాచేయడం వల్ల అధిక‌ బరువును త‌గ్గించుకుని శరీరాకృతిని అందంగా మార్చుకోవచ్చ‌ని వైద్య‌ నిపుణులు చెబుతున్నారు. 
 
అంతేకాకుండా, జీర్ణసమస్యలు, డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు పూర్తిగా దూరమవుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉంటుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. కేన్సర్ కణాలను నశింపజేస్తుంది. చర్మం కాంతివంతంగా మృదువుగా తయారవుతుంది. టూత్ పేస్టుతో కలిపి దంతాలు తోముకుంటే చిగుళ్ళ బాధల నుంచి విముక్తి పొందవచ్చు.
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments