శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 నవంబరు 2017 (13:57 IST)

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు చేతబడి చేయించారట!

క్రికెట్‌లో గెలుపోటములు సహజమే. జట్టులోని సభ్యులంతా సమిష్టిగా ఆడుతూ, అన్ని విభాగాల్లో రాణిస్తే విజయం తథ్యం. కానీ, శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్ మాత్రం మరోలా సెలవిస్తున్నాడు.

క్రికెట్‌లో గెలుపోటములు సహజమే. జట్టులోని సభ్యులంతా సమిష్టిగా ఆడుతూ, అన్ని విభాగాల్లో రాణిస్తే విజయం తథ్యం. కానీ, శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దినేశ్ చండీమాల్ మాత్రం మరోలా సెలవిస్తున్నాడు. 
 
క్రికెట్‌లో ఆటగాడికి టాలెంట్‌ ఒక్కటే సరిపోదని.. కాస్త అదృష్టం కూడా కలిసిరావాలని అంటున్నాడు. అందుకే క్రికెట్ సిరీస్‌ల ఆరంభానికి ముందు తాను మతగురువులు, మంత్రగాళ్ల దగ్గరకు వెళ్లి వస్తానని తెలిపాడు. అలాగే, పాక్ పర్యటనకు వెళ్లే ముందు మంత్రగాళ్లను కలిసినట్టు చెప్పారు. 
 
ముఖ్యంగా, "పాకిస్థాన్‌తో సిరీస్‌ ఆడేందుకు వెళ్లేముందు ఓ మంత్రగత్తెను కలిశానని.. శ్రీలంక చేతిలో పాకిస్థాన్‌ ఓడిపోయేలా చేతబడి చేస్తానని ఆమె మాటిచ్చారని.. ఆ తల్లి ఆశీర్వాదబలం, పూజల వల్లే మేం సిరీస్‌ గెలిచామని" చండీమాల్ చెప్పుకొచ్చాడు. 
 
కాగా, పాక్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లలోనూ చండీమాల్ ఓ శతకం, ఓ అర్థశతకం సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ ప్రపంచంలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. అయితే, పాక్‌తో టెస్ట్‌ సిరీస్‌‌ను 2-0తో కైవసం చేసుకున్న లంక.. 0-5తో వన్డే సిరీస్‌ను, 0-3 తో టీ20 సిరీస్‌ను కోల్పోయిన సంగతిని తెల్సిందే.