శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: ఆదివారం, 29 అక్టోబరు 2017 (16:48 IST)

ఒక్క ఫోన్ కాల్.. వారి జీవితాల్లో వెలుగులు నింపింది

ఒక్క ఫోన్‌కాల్‌.. ఒకే ఒక్క ఫోన్‌కాల్ వారి జీవితాల‌ను మార్చేసింది. త‌మ‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎన్నోరోజులుగా ఎదురు చూసి.. విసిగిపోయిన వారికి.. 1100 కాల్ సెంట‌ర్ రూపంలో గొప్ప ఊర‌ట ద‌క్కుతోంది. 1100 కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసి.. త‌మ స‌మ‌స్య చెప్పుకున్న

ఒక్క ఫోన్‌కాల్‌.. ఒకే ఒక్క ఫోన్‌కాల్ వారి జీవితాల‌ను మార్చేసింది. త‌మ‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎన్నోరోజులుగా ఎదురు చూసి.. విసిగిపోయిన వారికి.. 1100 కాల్ సెంట‌ర్ రూపంలో గొప్ప ఊర‌ట ద‌క్కుతోంది. 1100 కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసి.. త‌మ స‌మ‌స్య చెప్పుకున్న కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం వారి కుటుంబాల్లో ఎన‌లేని సంతోషాన్ని నింపుతోంది. కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం నుంచి స‌హాయం పొందడంతోనే ఊరుకోకుండా.. త‌మ క‌ష్టం తీర్చిన వారికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకునే సంస్కారాన్ని కూడా ప్ర‌ద‌ర్శిస్తున్నారు జనం.
 
స‌మ‌స్య చిన్న‌దైనా, పెద్ద‌దైనా.. దాని ప‌రిష్కారం మ‌న చేతుల్లో లేన‌ప్పుడు.. ఎన్నో ఇబ్బందులు ప‌డుతుంటాం. ప‌రిష్కారం కోసం ఎంద‌రినో ఆశ్ర‌యిస్తాం. తెలిసిన‌వాళ్లంద‌రినీ స‌ల‌హాల‌డుగుతాం. అయినా ప‌రిష్కారం కాన‌రాని ఎన్నో స‌మ‌స్య‌ల‌కు.. ఎంద‌రో బాధితుల‌కు.. వ‌ర ప్ర‌దాయినిగా మారింది ప‌రిష్కార వేదిక‌. ఎన్నో రోజులుగా తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు ఇక ప‌రిష్కారం కావ‌న్న నిస్పృహ‌లోకి వెళ్లిపోయామ‌ని.. అలాంటి ప‌రిస్థితిల్లో మేమున్నామంటూ మా స‌మ‌స్య తీర్చిన మీ రుణం తీర్చుకోలేనిదంటూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. 
 
ప‌గ‌లు, రాత్రి అన్న తేడా లేకుండా ఏ స‌మ‌యంలో ఫోన్ చేసినా.. స్పందించే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం చిత్తశుద్ధిపై హ‌ర్షం ప్ర‌క‌టిస్తున్నారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న అంటే  ఏంటో ఇప్పుడు క‌ళ్ల‌ముందు సాక్షాత్క‌రిస్తోందంటున్నారు. తాము అమెరికాలో ఉన్నామా? లేక ఆంధ్రాలో ఉన్నామా అని ఆశ్చ‌ర్య‌పోతున్నామంటున్నారు. తమను సమస్యల నుంచి బయట పడేయడంలో కీలకపాత్ర పోషించిన కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసి.. త‌మ స‌మ‌స్య ప‌రిష్కరించిన అధికారుల‌కు, కాల్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ధన్యవాదాలు చెబుతున్నారు.
 
గ‌తంలో ఎన్నోసార్లు చెప్పినా ప‌ట్టించుకోని విద్యుత్‌ శాఖ అధికారులు.. 1100 కాల్ సెంట‌ర్‌కు ఒక్క ఫోన్ చేయ‌గానే ప‌రుగెత్తుకొచ్చారంటూ చిత్తూరుకు చెందిన బాషా అనే రైతు ఆనందం వ్య‌క్తం చేశారు. వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్ కోసం కాళ్ల‌రిగేలా తిరిగాన‌ని.. కొన్ని నెల‌లుగా ప‌రిష్కారం కాని త‌మ స‌మ‌స్య‌ను 1100 కాల్ సెంటర్ ప్రతినిధులతో చెప్పుకోగానే.. విద్యుత్ శాఖ అధికారులు రెండు వారాల్లో ప‌రిష్కరించారంటూ ఆనంద బాష్పాలతో వ్య‌క్తం చేశారు. 1100 కాల్ సెంట‌ర్‌కు ప్ర‌త్యేకంగా ఫోన్ చేసి ముఖ్య‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాన‌ని.. త‌న‌ను క‌నిక‌రించిన విద్యుత్‌శాఖ అధికారుల‌కు ధ‌న్య‌వాదాలంటూ చెప్పారు.
 
విజ‌య‌వాడ‌కు చెందిన గూడూరి శ్రీను అనే వ్య‌క్తి కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసి.. మీ కార‌ణంగానే మా బంధువుకు వైద్యం చేయించుకోగ‌లిగామంటూ కాల్ సెంట‌ర్ నిర్వాహ‌కుల‌తో త‌న‌ ఆనందాన్నిపంచుకున్నారు. సెప్టెంబర్ 21వ తేదీన‌ విజ‌య‌వాడ పాత ప్ర‌భుత్వాసుప‌త్రికి వైద్యం కోసం తీసుకెళ్లిన త‌మ బంధువును.. మొద‌ట ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్నారు. వైద్యం చేయాలంటూ డాక్ట‌ర్లు, వైద్య సిబ్బందిని ఎంత‌గా బ‌తిమాలినా.. స‌రైన ట్రీట్‌మెంట్ అంద‌లేద‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితిల్లో తెలిసిన‌వాళ్లు ఇచ్చిన స‌ల‌హా మేర‌కు.. 1100 కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేశామ‌న్నారు. కాల్ సెంట‌ర్ నిర్వ‌హాకులు త‌మ గోడు మొత్తం ఓపిగ్గా విని.. అధికారుల‌కు స‌మాచారం ఇచ్చిన త‌రువాత‌నే.. త‌మ బంధువుకు చికిత్స చేయ‌డం ప్రారంభించార‌ని.. ఆ త‌రువాత‌నే త‌మ బంధువు భ‌వానీ కోలుకుంద‌ని చెప్పుకొచ్చారు.
 
క‌డ‌ప జిల్లా సీకే దిన్నె మండ‌లం తాడిగొట్ల‌కు చెందిన జి.కొల్లారెడ్డి.. ఎప్ప‌టి నుంచో ఇల్లు క‌ట్టుకోవాల‌నుకున్నారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ప్ర‌యోజ‌నం క‌న‌ప‌డ‌లేదు. అన్ని అర్హ‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ.. త‌న‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కం కింద ఇల్లు క‌ట్టుకోడానికి ఎవ‌రూ సాయం చేయ‌డం లేద‌ని బాధ‌ప‌డ్డారు. చివ‌ర‌కు 1100 కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసి వివ‌రాలు చెప్పిన త‌రువాత‌.. కొన్ని రోజుల‌కే ఎన్టీయార్ గృహ నిర్మాణ ప‌థ‌కం కింద ఇల్లు మంజూరైంది. దీంతో కొల్లారెడ్డ ఆనందానికి అవ‌ధులు లేవు. వెంట‌నే 1100 కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసి.. కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకున్నాడు.