ఆవనూనెతో బానపొట్టే కాదు.. బట్టతల కూడా మాయం
ఆధునికత పేరిట తీసుకునే ఆహారం, గంటల కొద్దీ కంప్యూటర్లకు అతుక్కుపోవడం.. వాకింగ్ లేకపోవడం వంటి కారణలతో ప్రస్తుతం 30 ఏళ్లకే ఒబిసిటీ ఆవహిస్తోంది. ఈ ఒబిసిటీ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయం ప్రభ
ఆధునికత పేరిట తీసుకునే ఆహారం, గంటల కొద్దీ కంప్యూటర్లకు అతుక్కుపోవడం.. వాకింగ్ లేకపోవడం వంటి కారణలతో ప్రస్తుతం 30 ఏళ్లకే ఒబిసిటీ ఆవహిస్తోంది. ఈ ఒబిసిటీ అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఊబకాయం ప్రభావంతో పొట్టపెరగడం, బరువు పెరగడం కూడా సర్వసాధారణంగా మారింది. అయితే ఊబకాయాన్ని దూరం చేసుకోవాలంటే.. ఆవనూనెను వాడాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆవనూనె బానపొట్టను కూడా మాయం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కెనోలా ఆయిల్ అని పిలువబడే ఆవనూనెను వంటల్లో ఉపయోగించడం ద్వారా నడుం చుట్టుకొలత తగ్గుతుందని, హృద్రోగ వ్యాధులు నయం అవుతాయట.
ఇంకా కెనోలా ఆయిల్‌ను వంటల్లో వినియోగించడం ద్వారా పొట్ట తగ్గిపోయిందని ఇప్పటికే పరిశోధనలో తేలింది. ఈ నూనెలో కొలెస్ట్రాల్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ గుండెను కాపాడుతాయి. జీవక్రియను మెరుగుపరుస్తాయి. బట్టతల మాయం కావాలంటే ఈ నూనెను వాడటం ద్వారా మంచి ఫలితాను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.