సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: గురువారం, 14 డిశెంబరు 2017 (22:06 IST)

శ్రుంగారం చేసేటపుడు మంటను తగ్గించే వట్టివేళ్లు

ఆడవారు ఎక్కువగా అధిక రక్తస్రావంతో బాధపడేవారు ఉంటారు. దీనిని వట్టివేళ్ళ సహాయంతో అరికట్టవచ్చు. వీటిని పెద్దపచారి షాపుల్లో అడిగితే వట్టివేళ్ళు తేలికగానే దొరుకుతాయి. వీటిని శుభ్రం చేసుకుని మెత్తగా దంచి పౌడర్ చేసుకొని దాన్ని నేరుగా గాని, పంచదార పాకం కలిపి

ఆడవారు ఎక్కువగా అధిక రక్తస్రావంతో బాధపడేవారు ఉంటారు. దీనిని వట్టివేళ్ళ సహాయంతో అరికట్టవచ్చు. వీటిని పెద్దపచారి షాపుల్లో అడిగితే వట్టివేళ్ళు తేలికగానే దొరుకుతాయి. వీటిని శుభ్రం చేసుకుని మెత్తగా దంచి పౌడర్ చేసుకొని దాన్ని నేరుగా గాని, పంచదార పాకం కలిపి లేహ్యంగా తినవచ్చు. పానకంలా తాగవచ్చు. అంతేకాక జననాంగంలో మంట, మూత్రశయంలో మంట, రతి కార్యక్రమంలో పాల్గోనేటప్పుడు కూడ మంట ఉన్నా దీని ద్వారా అరికట్టవచ్చు.
 
అంతేకాదు ఉసిరిపొడి కూడా రుతుస్రావాన్ని ఆపుతుంది. రక్తంలో వేడి పెరిగినప్పుడు రక్తస్రావం వేగం పెరుగుతుంది. ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఎక్కువ స్రావం జరుగుతుంది. పచ్చడి ఉసిరికాయాలు ఎండించి పగలగొట్టి లోపల గింజ తీసేసి పై బెరడుని మెత్తగా పౌడర్ చేసుకొని ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకుంటే ఆయుష్షు పెరుగుతుంది. అంతేకాదు రక్తంలో వేడిని తగ్గించి శరీరానికి చలవనిస్తుంది. 
 
ఉసిరిక చూర్ణాన్ని వాడూతూ ఉంటే తప్పకుండా రక్తస్రావం ఆగుతుంది. రక్తంతో కూడిన విరేచనాలు కూడా తగ్గుతాయి. అమితమైన చలవ కలుగుతుంది. కళ్ళు మంటలు, అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు ఇవన్నీ వేడిచేసినందు వలన కలిగే బాధ. ఇవి కూడ దీనిని వాడటం వలన అరికట్టవచ్చు.