సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (17:39 IST)

ఒత్తిడిని మాయం చేసే తులసీ ఆకుల టీ

తులసీ ఆకుల్లో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే తులసీని ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. ఇందులోని కార్టిసాల్ స్థాయిలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేగాకుండా ఒత్తిడి వలన మెదడుపై కలిగే ప్రతికూల ప్రభావాలను

తులసీ ఆకుల్లో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే తులసీని ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. ఇందులోని కార్టిసాల్ స్థాయిలు ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేగాకుండా ఒత్తిడి వలన మెదడుపై  కలిగే ప్రతికూల ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. తులసీలో యాంటీయాక్సిడెంట్లు, యాంటీ-స్ట్రెస్ గుణాలు నరాలకు విశ్రాంతి లభించేలా చేస్తాయి. 
 
శరీరంలో రక్తప్రసరణను నియంత్రిస్తాయి. తులసీలో వుండే ఔషధ గుణాలు ఒత్తిడి వల్ల కలిగే సమస్యల నుంచి ఉపశమన్నాన్నిస్తుంది. సహజంగా ఒత్తిడి తగ్గాలంటే.. రోజులో రెండుసార్లు పది ఆకులను నమిలితే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి దూరం చేసుకోవాలంటే.. పది ఆకులను వేడినీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. 
 
నిజానికి ఒత్తిడిని తగ్గించే మందుల వాడకం వలన చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. కానీ తులసీ ఆకులతో తయారు చేసిన టీని తాగడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చును. జలుబు, దగ్గు, కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కూడా తొలగించే గుణం తులసీలో వుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అలాగే తులసీ ఆకుల పేస్టు ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు చెప్తున్నారు.