శనివారం, 4 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (11:21 IST)

రాత్రి భోజనం పది గంటలు దాటితే...

రాత్రి భోజనం పది గంటల్లోపు తినేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే అర్థరాత్రి పూట చిరుతిళ్లు తినడం ద్వారా హృద్రోగ సంబంధిత వ్యాధులు, మధుమేహం సహా పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు

రాత్రి భోజనం పది గంటల్లోపు తినేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే అర్థరాత్రి పూట చిరుతిళ్లు తినడం ద్వారా హృద్రోగ సంబంధిత వ్యాధులు, మధుమేహం సహా పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అర్థరాత్రి తినడం ద్వారా జీవక్రియ,  హార్మోన్లు ప్రతికూల ప్రభావం చూపి బరువు, ఇన్సులిన్, కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినట్లు ఇప్పటికే పరిశోధనల్లోనూ వెల్లడి అయ్యింది. 
 
రాత్రి పూట భోజనం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల్లోపు తినేయడం మంచిదని.. పది గంటలు దాటితే అవి ఆరోగ్యానికి మేలు చేయబోవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మరుసటి రోజుకి సరిపడా... శారీరక, మానసిక శక్తి సమకూరాలంటే కంటి నిండా నిద్రపోవాలి. కాబట్టి పది గంటల్లోపు నిద్రించే అలవాటు చేసుకోవాలి. నిద్రలేమి వల్ల రోగ నిరోధక శక్తి సన్నగిల్లి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఎంతో అరుదుగా తప్ప నిద్ర వేళల్ని మరిచిపోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.