ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 29 నవంబరు 2017 (13:12 IST)

రుద్రాక్షలు ధరించి నిద్రించడం.. శృంగారంలో పాల్గొనడం కూడదు

రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలుండవు. మైలపడిన వారు రుద్రాక్షలను ముట్టుకోకూడదు. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించడం కూడదు. కుటుంబ సభ్యులైనా ఒకరి ధరించిన రుద్రాక్ష మాలను మరొకరు ధరించకూడదు. రుద్రాక్ష ధరించ

రుద్రాక్షలను ధరించడం ద్వారా అష్టకష్టాలు తొలగిపోయి.. సకల సంపదలు చేకూరుతాయని స్కాంద పురాణం చెప్తోంది. రుద్రాక్షలను పద్ధతి ప్రకారం, ఆధ్యాత్మిక గురువులు, పంచాంగ నిపుణుల సూచనల మేరకే ధరించాలి. మహా శివరాత్రి లేదా మాస శివరాత్రి రోజున ధరించడం ఉత్తమం. సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివపూజ చేయాలి. ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి తిథుల్లో రుద్రాక్షలను ధరించడం శుభదాయకం. 
 
నుదుట విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది. రుద్రాక్షలను ధరించిన వారికి అపజయాలుండవు. మైలపడిన వారు రుద్రాక్షలను ముట్టుకోకూడదు. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించడం కూడదు. కుటుంబ సభ్యులైనా ఒకరి ధరించిన రుద్రాక్ష మాలను మరొకరు ధరించకూడదు. రుద్రాక్ష ధరించి నిద్రించడం, వాటిని ధరించి శృంగారంలో పాల్గొనడం కూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలా చేస్తే ప్రతికూల ఫలితాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.