మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Updated : మంగళవారం, 5 డిశెంబరు 2017 (14:17 IST)

జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య రహస్యం తెలిస్తే షాకే...

టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్‌టిఆర్ ఒకరు. జూనియర్ ఎన్‌టిఆర్ డ్యాన్స్ వేసినా, ఫైట్ చేసినా, డైలాగ్ చెప్పినా ఎంతో ఎనర్జీగా చేస్తారు. ఇంత ఎనర్జిటిక్‌గా, ఇంత యాక్టివ్‌గా ఉండటానికి కారణం ఆయన పాటించే ఆహ

టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్‌టిఆర్ ఒకరు. జూనియర్ ఎన్‌టిఆర్ డ్యాన్స్ వేసినా, ఫైట్ చేసినా, డైలాగ్ చెప్పినా ఎంతో ఎనర్జీగా చేస్తారు. ఇంత ఎనర్జిటిక్‌గా, ఇంత యాక్టివ్‌గా ఉండటానికి కారణం ఆయన పాటించే ఆహారపు అలవాట్లు. జూనియర్ ఎన్‌టిఆర్ రెండు విధాలుగా ఆహారపుటలవాట్లు పాటిస్తారట.
 
సినిమాలో లావుగా కనిపించాలని అంటే హైదరాబాద్ బిర్యాని లాగించేస్తారట. ఇక అమ్మ చేసే సున్నుండలను చాలా ఇష్టంగా తింటారట. వాటర్ మిలన్స్ అయితే ఎప్పుడూ ఇంట్లో ఉండవలసిందే. ప్రతిరోజు అన్నంలో పప్పుతో పాటు నెయ్యిని కూడా ఎక్కువగా తింటారట. 
 
కానీ సన్నగా కావాలంటే మాత్రం క్యాలరీ ఫుడ్స్, ప్రొటీన్ ఫుడ్స్ అంటూ డైలీ చపాతి, ఫుడ్స్ మాత్రం తింటారట. ఎప్పుడైనా నాన్‌వెజ్ తినాలప్పుడు భార్య లక్ష్మీప్రణతి చేసే రొయ్యల కూరను మాత్రమే తింటుంటారట. బయట ఫుడ్స్ కంటే ఎక్కువగా ఇంట్లో అమ్మ, భార్య చేసే వంటకాలను తింటుంటారు. అందుకే జూనియర్ ఎన్‌టిఆర్ ఎనర్జీగా, యాక్టివ్‌గా ఉంటారు.