Daily Horoscope
✕

రావి ఆకుల్లోని ఔషధ గుణాలు.. టీ సేవిస్తే.. చర్మవ్యాధులు పరార్

Written By సెల్వి
Updated: సోమవారం, 20 జులై 2020 (17:54 IST)
peepal leafs
రావిచెట్టులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రావి ఆకుల్లో గ్లూకోజ్, ఆస్టియోరిడ్, ఫినోలిక్ వంటి గుణాలున్నాయి. ఓ వైపు ఈ చెట్టుకు పూజలు చేస్తూనే.. మరోవైపు దీని ఆకులు, బెరడు, కాండం, విత్తనాలు, పండ్లను ఔషధాల తయారీలో వాడుతున్నారు. డయాబెటిస్ నివారణకు రావిచెట్టు ఆకులు ఎంతగానో ఉపయోగపడుతాయి. 
 
రావి చెట్టు ఆకులను తీసుకుని పొడిచేసి రెండు గ్లాసుల నీటిలో ఓ స్పూన్ పొడిని వాడాలి. ఆ నీటిని బాగా మరిగించి.. వడగట్టాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే... డయాబెటిస్ చాలా వరకూ నయం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. రావి ఆకుల్ని తింటే తామర లాంటి చర్మ వ్యాధులు రావు. రావి ఆకుతో టీ తయారుచేసుకొని తాగితే మంచిది. 
 
ఆస్తమా తగ్గాలంటే.. రావి ఆకు, పండ్లు, బెరడును విడివిడిగా ఎండబెట్టి... పొడి చేసుకోవాలి. వీటిని సమాన పరిమాణంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు వాడితే, ఆస్తమా సమస్య తగ్గుతుంది. రావి ఆకు పొడిని మూడు గ్రాములు తీసుకొని, నీటిలో కలిపి... రోజుకు రెండుసార్లు తాగినా చక్కగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

నవంబర్ 7, 2026 నాటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాతావరణం ఎలా వుంది?

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. 70.72 శాతం ఓటింగ్ నమోదు.. అగ్రస్థానంలో విశాఖపట్నం

ప్రజలు తుఫానుతో కష్టాలు పడుతుంటే.. జగన్ రాజకీయాలు చేస్తున్నారు.. చంద్రబాబు (video)

కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం, పరుగులెత్తిన ప్రయాణికులు, వీడియో

బాలికపై పొలంలో సామూహిక అత్యాచారం, సోషల్ మీడియాలో షేర్ అవుతున్న బాధితురాలి వీడియో

అన్నీ చూడండి

అమ్మవారి దివ్యశక్తిని ఆవిష్కరిస్తూ మ్యూజికల్ టచ్ ఇచ్చిన మహాకాళి

ది ట్రైటర్స్ తెలుగు’ సీజన్ 1 విజేతలుగా నిలిచిన శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి

Anaswara Rajan: కాకాలో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ప్రౌడ్‌గా ఉంది : అనస్వర రాజన్

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ఫన్ చిత్రం పూజతో ప్రారంభం

లెక్కలు, ఎక్కాలు రాని నలుగురు కుర్రాళ్లు కు చంద్రయాన్ కు సంబంధం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments