శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (14:38 IST)

అల్సర్‌‌కు దివ్యౌషధం బాదం..

ఆధునిక జీవితంలో ఆహారంలో మార్పులు, పని ఒత్తిడి, రాత్రింబవళ్లు శ్రమించడం, నిద్రలేమి, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, అకాలభోజనం వంటి కారణాలతో అల్సర్ ఏర్పడుతుంది. ఆకలేసినప్పుడు ఆహారం తీసుకోకుండా.. ఎ

ఆధునిక జీవితంలో ఆహారంలో మార్పులు, పని ఒత్తిడి, రాత్రింబవళ్లు శ్రమించడం, నిద్రలేమి, కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, అకాలభోజనం వంటి కారణాలతో అల్సర్ ఏర్పడుతుంది. ఆకలేసినప్పుడు ఆహారం తీసుకోకుండా.. ఎప్పుడుపడితే అప్పుడు తీసుకోవడం అల్సర్‌కు కారణమవుతుంది.
 
అల్సర్‌‌తో ఇబ్బందులు పడే వారు బాదం పప్పుతో చేసే ఔషధాన్ని తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. బాదం పొడి, నెయ్యి, పాలు, పంచదారను కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం, సాయంత్రం పూట తీసుకుంటే అల్సర్ నయం అవుతుంది. ఉదరంలో ఆమ్లాలను తగ్గిస్తుంది.
 
అలాగే సగ్గుబియ్యంతో గొంతులో మంటను దూరం చేసుకోవచ్చు. సగ్గుబియ్యం, పెరుగు, ఉప్పును తీసుకోవాలి. ఉడికించిన సగ్గుబియ్యంలో కాసింత ఉప్పు, పులుపెక్కని పెరుగును చేర్చి..బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఓ పూట తీసుకుంటే అల్సర్‌తో ఏర్పడే గొంతు మంటను దూరం చేసుకోవచ్చు. యూరీనల్ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. సగ్గుబియ్యం ఉదర సంబంధిత రుగ్మతలను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.