శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 22 ఆగస్టు 2017 (16:36 IST)

అమ్మో.. పొయ్యి మీద పాలు పొంగిపోయాయే... ఏం జరుగుతుందో?

అప్పుడప్పుడు పాలని స్టవ్ మీద పెట్టి ఏదో ఆలోచనలో పడిపోవడం చాలా సహజం. కాసేపటికి తేరుకుని గమనించి స్టవ్ ఆపేసరికి పాలు కాస్తా పొంగిపోతూ కనబడతాయి. కొన్ని పాలు స్టవ్ చుట్టూ పడిపోతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో కొన్ని రకాల విశ్వాసాలుంటాయి. వాటిని అంధ

అప్పుడప్పుడు పాలని స్టవ్ మీద పెట్టి ఏదో ఆలోచనలో పడిపోవడం చాలా సహజం. కాసేపటికి తేరుకుని గమనించి స్టవ్ ఆపేసరికి పాలు కాస్తా పొంగిపోతూ కనబడతాయి. కొన్ని పాలు స్టవ్ చుట్టూ పడిపోతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో కొన్ని రకాల విశ్వాసాలుంటాయి. వాటిని అంధ విశ్వాసాలని కొందరంటారు. భారతీయులు ఇటువంటి కొన్ని విషయాలను శకునాలుగా భావిస్తారు. 
 
ముఖ్యమైన పనిమీద బయటికి వెళుతున్నప్పుడు పిల్లి ఎదురవడం, కళ్ళు అదరడం, బల్లి అరవడం, అద్దం పగిలిపోవడం లేదా ఇంటి నుంచి బయటకి వెళుతున్నప్పుడు ఎవరైనా వెనుక నుంచి పిలవడం వంటివి కొన్నింటిని శకునాలుగా భావిస్తుంటారు. జీవితంలో భాగంగా ఇటువంటి నమ్మకాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జరుగబోయే విషయాల గురించి ఆయా శకునాలు ముందుగానే సూచనలిస్తున్నట్లు భావిస్తారు. కొన్నిసార్లు అవి నిజం కావచ్చు.
 
కొన్నిసార్లు మనం వాటిని విస్మరించాలి. మరి పాలు పొంగి చిందితే లేదా చెడిపోయినట్లు అనిపిస్తే అది ఏ విషయానికి సూచికో తెలుసా.. మంచి శకునంగా భావించవచ్చా లేదా ఏమైనా హెచ్చరికగా భావించాలా. ఈ విషయంలో కొన్ని వాస్తవాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిక్కున పొంగితే శుభ సూచికంగా భావిస్తారు. ఈ విధంగా చూస్తే అదృష్టం, సంపద, శాంతి, ఆరోగ్యంతో పాటు అనుకూలతలు కలుగుతాయని భావిస్తారు.
 
కాబట్టి తూర్పు దిక్కు నుంచి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు తద్వారా అదృష్టాన్ని అనుకూలతని పొందేందుకు ఈ ఆచారాన్ని పాటిస్తారు. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కాబట్టి తూర్పు వైపు పాలని చిందిస్తే ఆ ఇంటిలో అన్ని శుభపరిణామాలు చోటుచేసుకుంటాయని ఒక నమ్మకం. సాధారణంగా పాలు చిందడం శుభపరిణామాలకి సంకేతంగా చెప్పుకుంటారు. పాలు సమృద్థికి, సంపదకు సంకేతం, అలాగే శుద్ధికి ప్రతీక పాలు, పవిత్రమైన ఆవు పాలు హిందూ ధర్మంలో ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయి. యజ్ఞాలలో అలాగే వివిధ ఆధ్మాత్మిక కార్యక్రమాలలో ఆవుపాలతో తయారుచేసిన నేతిని వాడతారు. కాబట్టి పొరపాటున పాలు పొంగితే ఏదో అపశకునం అనుకోకండి.. మీ ఇంటిలో శుభ శూచకమనేది దాని అర్థం.