1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By ivr
Last Modified: శనివారం, 11 మార్చి 2017 (19:48 IST)

ఆయుర్వేదం చిట్కాలు... నూనెతో మర్దన చేసి స్నానం చేస్తే...

ప్రతిరోజూ శరీరానికి నూనెతో మర్ధన గావించి, తరువాత స్నానము చేయటం చాలా మంచిది. దీనివలన సర్వాంగాలకు పుష్ఠి కలుగుతుంది. ఆవనూనె, గంధపు చెక్కల నుండి తీసిన నూనె, సుగంధ ద్రవ్యముల నుండి తీసిన నూనెలు, పుష్పముల నుండి లభించే నూనెలను అభ్యంగనానికి ఉపయోగించవచ్చు.

ప్రతిరోజు చెవులలో కొద్దిగా తైలపు చుక్కలు వేసుకోవడం వలన, చెవులలోని మాలిన్యములు తొలగిపోతాయి. శబ్ధగ్రహణము బాగుంటుంది. చెవిపోటు, ఇతర సమస్యలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. 
 
ప్రతిరోజూ పాదములకు తైలముతో మర్దన చేయుడం వల్ల పాదాలలో బలము వృద్ధిచెందుతుంది. మొద్దుబారిన పాదాలు స్పర్శాజ్ఞానములను సంతరించుకుంటాయి. పాదముల మీద పగుళ్ళను పోగొడతాయి. దీనివలన నేత్రములకు కూడా చలువచేస్తుంది. కళ్ళు ప్రకాశవంతమవుతాయి. సుఖనిద్ర కలుగుతుంది. 
 
శిరస్సు మీద నూనె మర్దనచేయుట వలన మెదడు శక్తివంతమవుతుంది. కళ్ళు, చెవులు, దంతములకు ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరాభ్యంగనము వలన తైలము రోమకూపములలో నుండి లోనికి ప్రవేశించి నరములు, రక్తనాళములలో ఎంతో చురకుదనాన్ని కలిగిస్తుంది. ధాతువులను వృద్ధిచేస్తుంది.