బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జులై 2024 (19:23 IST)

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

garlic
వెల్లుల్లిని తినాలంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కొందరికి ఆ వాసన అంటే ఇష్టం వుండదు. ముఖ్యంగా మహిళలు ఖాళీ కడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుంటే ఆరోగ్యం వారి సొంతం అవుతుంది. ఇంకా సులభంగా బరువు తగ్గుతారు. 
 
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అజీర్ణం దరిచేరకుండా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య నుండి బయటపడటానికి వెల్లుల్లి సహాయపడుతుంది. 
 
మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని ఉదయాన్నే తాగితే మంచిది. 
 
వెల్లుల్లి వివిధ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంది. అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.