మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (13:20 IST)

అరటిపండు-బంగాళాదుంప రసంతో చర్మానికి మేలెంత?

అరటిపండు గుజ్జుతో చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అరటి గుజ్జును ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పొడిబారే సమస్యే ఉండదు. అలాగే చర్మ సౌందర్యానికి నిగారింపు చేకూర్చాలంటే..

అరటిపండు గుజ్జుతో చర్మసౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. అరటి గుజ్జును ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పొడిబారే సమస్యే ఉండదు. అలాగే చర్మ సౌందర్యానికి నిగారింపు చేకూర్చాలంటే... రెండు చెంచాల క్యారెట్‌ గుజ్జుకు చెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. పదినిమిషాలయ్యాక కడిగేస్తే చర్మఛాయ మెరుగవుతుంది.
 
గుడ్డులోని తెల్లసొనా, చెంచా చొప్పున తేనె, ఆలివ్‌నూనె తీసుకుని అన్నింటినీ కలిపి ముఖం, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే బంగాళాదుంప రసంలో అరచెంచా పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేనునిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం తాజాగా కనిపిస్తుంది.